![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_latestnews/bollywood89df4818-58a4-4cfa-8a7b-10e42a0dd830-415x250.jpg)
కపూర్ ఖాన్ – అర్జున్ కపూర్ : బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ , అర్జున్ కపూర్ మధ్య దాదాపు 5 సంవత్సరాల వయసు తేడా ఉంటుంది కానీ వీరిద్దరూ ‘కి అండ్ కా’ సినిమాలో కలిసి నటించారు . అలాగే ఈ సినిమాలో ఇద్దరు భార్యాభర్తలుగా నటించారు .. అలాగే ఈ మూవీలో ఇద్దరి మధ్య ఘాటు రొమాన్స్ సన్నివేశాలు కూడా గట్టిగానే ఉంటాయి ,, ఇక ఈ మూవీ 2016 లో రిలీజ్ అయింది. ఐశ్వర్య రాయ్ – రణబీర్ కపూర్: ఇక మాజీ ప్రపంచ సుందరి ఐశ్వరరాయ్ , రణబీర్ కపూర్ కూడా ఏ దిల్ హై ముష్కిల్ సినిమాలో కలిసి నటించారు .. అలాగే ఈ సినిమాలు వీరిద్దరి మధ్య ఓ లిప్ లాక్ సన్నివేశం తో పాటు మరికొన్ని రొమాన్స్ సన్నివేశాలు కూడా ఉన్నాయి .. అయితే ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే .. ఐశ్వర్య రన్బీర్ కంటే 9 సంవత్సరాలు పెద్దది అయినప్పటికీ కూడా ఈ సినిమాలు వీరిద్దరూ రెచ్చిపోయి హాట్ సన్నివేశాలు నటించి షాక్ ఇచ్చారు .
బిపాసా బసు- కరణ్ సింగ్ గ్రోవర్ : బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ బిపాసా బసు , కరణ్ సింగ్ గ్రోవర్ తో కలిసి అలోన్ సినిమాలో నటించింది .. ఈ సినిమా నుంచి వీరి మధ్య ప్రేమ కూడా మొదలైంది అని అంటారు .. ఈ సినిమాలో ఈ ఇద్దరి మధ్య చాలా రొమాంటిక్ సన్నివేశాలు కూడా ఉన్నాయి .. అలోన్’ సినిమాలో మొదలైన లవ్ ను పెళ్లి బంధంతో వీరు బలపరిచారు .. అయితే కరణ్ బిపాసా కంటే నాలుగు సంవత్సరాలు చిన్నవాడు . అక్షయ్ కుమార్ - రేఖ: బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ - రేఖా మధ్య దాదాపు 13 సంవత్సరాల వయసు తేడా ఉంటుంది .. ‘ఖిలాడియోం కా ఖిలాడి’ సినిమాలో వీరిద్దరూ కలిసి నటించరు .. అలాగే వీరిద్దరి మధ్య ఈ సినిమాలో చాలా ఘాటు సన్నివేశాలు కూడా ఉన్నాయి . రణబీర్ కపూర్- కొంకణ సేన్ శర్మ : ఇక రన్బీర్ కపూర్ , కొంకణ సేన్ శర్మ వేక్ అప్ సింద్’ సినిమాలో జంటగా నటించారు .. ఇక ఇందులో ఈ ఇద్దరు మధ్య లిప్ లాక్ సన్నివేశాలతో హాట్ రొమాన్స్ తో కూడా మంటలు పుట్టించారు .. ఇలా చాలామంది బాలీవుడ్ హీరోయిన్లు తమకంటే చిన్న వయసు ఉన్న హీరోలతో రొమాన్స్ చేసి కొత్త ట్రెండ్ క్రియేట్ చేశారు .. కానీ టాలీవుడ్ లో ఇలాంటి ట్రెండ్ ఊహకు కూడా అందదేమో.