![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_latestnews/allu-arjun07e9c099-10b6-432c-96d1-e7673fcb89fa-415x250.jpg)
ఇక దేవిశ్రీ సంగీతం పక్కనపెట్టి చూస్తే తండేల్ ఓ బిలో యావరేజ్ స్థాయిలోనే ఆగిపోయేది . ఇక ఈ క్రెడిట్లో కొంత అల్లు అర్జున్ కు కూడా వెళుతుంది .. ఎందుకంటే తండేల్ సినిమాకు దేవిశ్రీప్రసాద్ ని తీసుకోవాలనుకున్నప్పుడు అల్లు అరవింద్ కాస్త అనుమానపడ్డాడు .. అప్పటికే పుష్ప 2తో దేవిశ్రీప్రసాద్ చాలా బిజీ అంత బిజీ లో తండేల్ కు టైం ఇవ్వగలడా లేదా ? అని అరవింద్ అనుమానం దాంతో వేరే సంగీత దర్శకున్ని ఎంచుకోవాలని ఆలోచన కూడా వచ్చింది .. కానీ అల్లు అర్జున్ మాత్రం లవ్ స్టోరీ అంటే దేవిశ్రీప్రసాద్ ఉండాల్సింది అని అల్లు అరవింద్ కు సలహా ఇచ్చారు ..
ఇక అది ఇప్పుడు బాగా వర్క్ అవుట్ అయింది .. దేవిశ్రీ లేకపోతే తన పాటలు లేకపోతే తండేల్ పరిస్థితి మరోలా ఉండేదేమో ..? ఇక లవ్ స్టోరీ అంటే దేవికి ఎక్కడలేని కొత్త ఎనర్జీ వచ్చేస్తుంది .. గతంలో ఉప్పెన సినిమాకి కూడా ఇలానే మంచి ట్యూన్లు ఇచ్చాడు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో మెప్పించాడు .. ఇప్పుడు తండేల్ తోను తనలోని కొత్త దేవిని చూపించాడు .. ఇకమీదట లవ్ స్టోరీలు అనగానే దేవిశ్రీప్రసాద్ గుర్తొస్తాడని ఈ విధంగా తండేల్ తో ప్రభావం చూపించాడు.