![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_latestnews/chiranjeevi19857920-5b2c-4333-83a2-1f9633211893-415x250.jpg)
అలాగే చిరంజీవి - అనిల్ రావిపూడి సినిమా మే నెలలో షూటింగ్ కు వెళుతుందని .. అలాగే వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేస్తారట .. ఇక అనిల్ రావు పూడి మార్క్ కమర్షియల్ అండర్టైనర్ గా ఈ సినిమా ఉండబోతుంది .. ఇక ఇందులో వింటేజ్ చిరంజీవి కనిపిస్తారని కూడా నిర్మాత చెప్పుకొచ్చారు .. ఇప్పటికే అనిల్ రావిపూడి వరుస విజయాలతో ఫుల్ జోష్లో ఉన్నాడు .. ఈ సంక్రాంతికి వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా రీజనల్ సినిమాలోనే ఆల్‌టైం ఎక్కువ కలెక్షన్ సాధించిన సినిమాగా రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు ..
ఇక ప్రస్తుతం ఈ సినిమా సక్సెస్ను అనిల్ ఎంజాయ్ చేస్తున్నాడు .. చిరంజీవి కూడా విశ్వంభర సినిమా రిలీజ్ తర్వాత కాస్త బ్రేక్ తీసుకొని అనిల్ సినిమా షూటింగ్లో అడుగు పెడతారు .. ఈ సినిమాతో మరోసారి ఈ బాక్స్ ఆఫీస్ కు మెగాస్టార్ స్టామినా ఏంటో చూపించబోతున్నాడు . ఇక విశ్వక్ హీరోగా సాహు గారపాటి నిర్మించిన లైలా .. రేపు ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి చిరంజీవి చీఫ్ గెస్ట్ గా వస్తున్నారు. ఇక ఈ వేడుకకి అనిల్ కూడా వస్తున్నారట .. ఇదే వేదికపై ఈ సినిమాపై మరో అప్డేట్ కూడా వచ్చే అవకాశం ఉందని కూడా అంటున్నారు .