![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_latestnews/thandel-movieeb15c94a-e51f-40bf-ba11-5f91014c47a4-415x250.jpg)
అయితే ఈ విషయం ఇలా ఉంచితే మన తెలుగు రాష్ట్రాలకు పంపిణీదారుల నుంచి తీసుకున్న 25 కోట్లకు మాత్రం ఎలాంటి డొక్కా లేదని క్లారిటీ మొదటి రోజు కలెక్షన్ తోనే వచ్చేసింది .. ఏపీ (సిడెడ్ మినహా) 12 కోట్ల వరకు అడ్వాన్సులు తీసుకున్నారు. అంటే ఇక్కడ వైజాగ్ ఏరియా 3 కోట్ల వరకు పడింది .. మొదటి రోజునే 88 లక్షల వరకు షేర్ వచ్చింది .. రెండు మూడు రోజుల్లో కలిపిన ఎంత తక్కువగా లెక్క కట్టుకున్న రెండు కోట్లు రావచ్చు అంటే ఫస్ట్ వీకెండ్ తర్వాత రావాల్సింది .. జస్ట్ కోట్టి మాత్రమే అంటే ఫస్ట్ వీక్ లో బ్రేక్ ఈవెన్ అయిపోతుంది.
ఇక ఇదే పరిస్థితి అన్ని ఏరియాల్లో కూడా కనిపిస్తుంది .. అందు కారణంగానే రెండు రాష్ట్రాల్లో అడ్వాన్స్ గా తీసుకున్న 25 కోట్ల మేరకు ఎలాంటి సమస్య లేదు. కానీ ఇక్కడ కావాల్సింది అది కాదు మరింత రన్ మరింత కలెక్షన్ మరింత ఓవర్ ఫ్లోస్ నిర్మాత బన్నీవాస్ టార్గెట్ ఇదే థియేటర్ల మీద నుంచి కనీసం 15 కోట్లు ఓవర్ ఫ్లో వసూలు చేయాలి అప్పుడే నిర్మాతగా బన్నీ వాస్ సక్సెస్ అయినట్టు. ఇక గీత సంస్థలో బన్నీ వాస్ కు సరైన బ్లాక్ బస్టర్ పడి చాలా సంవత్సరాలవుతుంది .. అలాగే నాగచైతన్య కి కూడా సరైన హిట్ పడి చాలా కాలం అవుతుంది .. పుష్ప సినిమాలను పక్కనపెడితే దేవిశ్రీప్రసాద్ కు మంచి పేరు వచ్చి కూడా చాలా రోజులైంది .. ఇలా అన్ని విధాలుగా తండేల్ సినిమా చాలామందికి మంచి బూస్ట్ ఇచ్చింది .. ఇక ఇవ్వాల్సింది నష్టాలు రాకుండా లాభం తెచ్చి పెట్టడమే .. ఇక మరి తండెల్ నిర్మాతలకు ఎలాంటి లాభాలు తెచ్చిపెడుతుందా లేక.. చివరకు బొక్క బార్ల పడుతుందా అనేది కాలమే సమాధానం చెప్పాలి.