![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_latestnews/aarushi-nishanke1009b11-893d-4ae0-bf5e-1a28ef766795-415x250.jpg)
ఇక ఇప్పుడు ఆరుషి చెప్పిన దాని ప్రకారం ఐదు కోట్లు పడితే 15 కోట్ల వరకు లాభం వస్తుందని చెప్పడంతో ఆమె ఈ డీల్ కు ఒప్పుకుందట అంతే కాకుండా స్క్రిప్ట్ ఫైనల్ చేయడం ఆమెకు నచ్చిన పాత్ర ఇస్తానని ఆరీషి కి కేటుగాళ్లు చెప్పారట .. ఒకవేళ ఆమె పాత్ర పట్ల సంతోషంగా లేకుంటే ఇచ్చిన డబ్బును 15% వార్షిక వడ్డీతో తిరిగి ఇస్తామని ఆమెను నమ్మించినట్టు తెలుస్తుంది. ఇక దీంతో నాలుగు కోట్లు పెట్టుబడి పెట్టింది.. కానీ ఆరుషికి సినిమాలో అవకాశం రాలేదు .. డబ్బు కూడా తిరిగి రాలేదు ఇలా చాలా కాలం ఎదురు చూసిన తర్వాత తాను మోసపోయానని తెలుసుకొని ఆరుషి డెహ్రాడూన్ లోని కొత్వాలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది .. ఆమె కంప్లైంట్ మేరకు ముంబైలో ఉంటున్న మానసి వరుణ్, వరుణ్ ప్రమోద్‌లపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును మొదలుపెట్టారు.
అదే విధంగా తనను మోసం చేసిన నిర్మాతలు మినీ ఫిలిమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అధికారిక పేజీలో చిత్ర బంధం నకిలీ ఫోటోలను ప్రసారం చేశారని కూడా ఈమె ఆరోపిస్తుంది .. తన డబ్బు తిరిగి అడిగినప్పుడు చంపేస్తారని తన కుటుంబ ప్రతిష్ఠను పాడు చేస్తావని వారి బెదిరించారని కూడా ఈమె కంప్లైంట్ లో పేర్కొన్నారు .. సైబర్ మోసాలు , డిజిటల్ నేరాలతో ఎంతోమంది సామాన్యులు మోసపోతున్నా ఈ రోజుల్లో ఒక వి విఐపి మాజీ ముఖ్యమంత్రి కూతురు ఇలా మోసపోవడం కచ్చితంగా ఆందోళనకరమైన విషయమే. ఇక ఎఫ్ఐఆర్ ప్రకారం మహారాష్ట్రలోని ముంబైలోని జుహులోని జెబి నగర్‌లోని ఫెయిరీ ల్యాండ్, రోడ్ 10, కైఫీ అజ్మీ పార్క్ నివాసితులు మాన్సి వరుణ్ బాగ్లా, వరుణ్ ప్రమోద్ కుమార్ బాగ్లా డెహ్రాడూన్‌లోని ఆరుషి నివాసంలో ను సంప్రదించి, తమను తాము మినీ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్‌గా పరిచయం చేసుకున్నారు. నిందితులు తాము షానాయా కపూర్, విక్రాంత్ మాస్సే నటించిన ‘ఆంఖోన్ కి గుస్తాఖియాన్’ అనే చిత్రాన్ని నిర్మిస్తున్నామని చెప్పుకున్నారు .