యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అక్కినేని నాగార్జున కుమారుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన యువ సామ్రాట్ తనదైన నటనతో అభిమానులను ఆకట్టుకున్నాడు. ఇప్పటివరకు ఎన్నో సినిమాలలో నటించిన అక్కినేని నాగచైతన్య లవ్ స్టోరీ సినిమాతో విపరీతంగా ఫ్యాన్స్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ఈ సినిమాలో సాయి పల్లవి, నాగచైతన్య నటన ప్రేక్షకులకు ఎంతగానో నచ్చింది. దీంతో వీరిద్దరూ మరోసారి కలిసి జంటగా నటించిన తాజా చిత్రం తండేల్.


ఈ సినిమాకు చందు మొండేటి దర్శకత్వం వహించారు. ఈ సినిమా విడుదలైన మొదటి రోజు నుంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా కేవలం రెండు రోజుల్లోనే భారీగా కలెక్షన్లను రాబడుతోంది. తండేల్ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చారు. అల్లు అరవింద్, బన్నీ వాసు తండేల్ సినిమాకు సంయుక్తంగా నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ సినిమాకు గాను రెండు రోజుల్లో రూ. 41.20 కోట్ల గ్రాఫ్ కలెక్షన్లు వచ్చినట్లుగా మేకర్స్ అనౌన్స్ చేశారు.


బ్లాక్ బస్టర్ లవ్ సునామీ అంటూ మేకర్స్ తాజాగా పోస్టర్ ను రిలీజ్ చేశారు. అక్కినేని నాగచైతన్య ఇప్పటివరకు ఎన్నో సినిమాలలో నటించినప్పటికీ తాను నటించిన సినిమాలన్నింటిలో తండేల్ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమాగా నిలిచే అవకాశం ఉంది. ఇక వీకెండ్ కావడంతో తండేల్ సినిమా కలెక్షన్లు మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయని చిత్ర బృందం భావిస్తోంది. ఈ సినిమా సక్సెస్ కావడంతో చిత్ర బృందం సక్సెస్ మీట్ ను కూడా ఘనంగా నిర్వహించారు.


కాగా వివాహం తర్వాత నాగ చైతన్య నుంచి వచ్చిన మొదటి చిత్రం తండేల్. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో శోభిత రాకతో నాగచైతన్య కెరీర్ పూర్తిగా మారిపోయిందని అభిమానులు అంటున్నారు. ఇకనుంచి అన్ని మంచి రోజులే వస్తాయని తాను నటించే అన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ విజయాలను అందుకుంటాయని అభిమానులు సోషల్ మీడియా వేదికగా వారి అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: