బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బాలీవుడ్ ఇండస్ట్రీలోనే బడా హీరోగా మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. సినిమాలతో పాటు బిజినెస్ వ్యవహారాలను కూడా సల్మాన్ ఖాన్ నిర్వహించడం గమనార్హం. హ్యూమన్ బ్రాండ్ సల్మాన్ ఖాన్ సొంత బ్రాండ్ కావడం విశేషం. సల్మాన్ ఖాన్ 2013లో ఈ బ్రాండ్ ను ప్రారంభించాడు. దీని ద్వారా సల్మాన్ ఖాన్ భారీగా డబ్బులను సంపాదిస్తున్నాడు. అంతేకాకుండా సినిమాల్లోనూ నటిస్తూ విపరీతంగా డబ్బులను పొందుతున్నాడు.


సినిమాల ద్వారా, వ్యాపారాల ద్వారా ఎంతో డబ్బులను సంపాదించే సల్మాన్ ఖాన్ చారిటబుల్ ట్రస్ట్ కు భారీగా విరాళాలు అందజేస్తాడు. ఆ డబ్బులతో ఎంతోమంది సహాయాన్ని పొందుతున్నారు. సల్మాన్ ఖాన్ తన ఫిట్నెస్ పై ఎక్కువ దృష్టి పెడతాడు. అతను ఫిట్నెస్ సెంటర్స్ కూడా ప్రారంభించాడు. ఈ సెంటర్స్ భారతదేశం అంతటా కలిపి 300 కన్నా ఎక్కువ బ్రాంచ్ లు ఉండడం విశేషం. సల్మాన్ ఖాన్ అనేక రకాల బ్రాండ్లను ప్రమోట్ చేస్తూ ఉంటాడు.

ఆ బ్రాండ్ల ద్వారా కోట్లలో డబ్బులను సంపాదిస్తున్నాడు. ఇతనికి సల్మాన్ ఖాన్ ఫిలిమ్స్ అనే పేరుతో సొంత నిర్మాణ సంస్థ కూడా ఉంది. ఆ బ్యానర్ పై అనేక సినిమాలను నిర్మించాడు. ఇదిలా ఉండగా.... సల్మాన్ ఖాన్ తాజాగా తన తమ్ముని కుమారుడు అర్హన్ ఖాన్ పాడ్ కాస్ట్ లో పాల్గొన్నారు. అందులో భాగంగా మాట్లాడుతూ కొన్ని ఆసక్తికరమైన విషయాలను షేర్ చేసుకున్నారు. రోజుకి రెండు మూడు గంటలు మాత్రమే నిద్రపోతానని ఈ సల్మాన్ ఖాన్ అన్నారు.

నెలలో రెండు మూడు రోజులు మాత్రమే ఏడు నుంచి ఎనిమిది గంటలు నిద్రపోతానని సల్మాన్ ఖాన్ అన్నారు. షూటింగ్ సమయంలో కూడా చిన్న గ్యాప్ ఉంటే చిన్న కునుకు తీస్తాను. విమానం ఎక్కినప్పుడు విమానం కుదుపులకు హాయిగా నిద్రపోతాను. కానీ జైలులో ఉన్నప్పుడు నేను ఎక్కువ సమయాన్ని నిద్రకు కేటాయించానని సల్మాన్ ఖాన్ వెల్లడించారు. కాగా ప్రస్తుతం సల్మాన్ ఖాన్ సికిందర్ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందా అని బాలీవుడ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: