నందమూరి నటసింహం బాలకృష్ణ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతోంది. తనదైన నటనతో ఎంతోమంది అభిమానులను ఆకట్టుకుంటున్నాడు. తన సినీ కెరీర్ లో ఎన్నో అద్భుతమైన చిత్రాలలో నటించి బ్లాక్బస్టర్ హిట్స్ తన ఖాతాలో వేసుకున్నాడు. బాలయ్య నటించిన తాజా చిత్రం డాకు మహారాజ్. ఈ సినిమా భారీగా కలెక్షన్లను రాబట్టింది. దీంతో బాలయ్య బాబు మరో హిట్ సినిమాను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఈ సినిమా అనంతరం బాలకృష్ణ ప్రస్తుతం అఖండ-2 సినిమా చేయబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ కూడా ప్రారంభమైంది. 

కొన్ని కీలక సన్నివేశాలను ప్రయాగరాజ్ లోని కుంభమేళాలో అఘోరాల మధ్యలో నిర్వహించారని సమాచారం అందుతోంది. ఈ సినిమాలో బాలయ్య బాబు సరసన హీరోయిన్లుగా సంయుక్త మీనన్, ప్రగ్యా జైస్వాల్ నటిస్తున్నారు. తమన్ ఈ సినిమాకు సంగీతాన్ని సమకూరుస్తున్నారు. కాగా, ఈ సినిమా షూటింగ్ చాలా వేగంగా జరుగుతోంది. ఇక ఈ సినిమా నుంచి తాజాగా ఓ విషయం వెలుగులోకి వచ్చింది. 


నిన్ను కోరి, రంగస్థలం, సరైనోడు వంటి అనేక సినిమాలలో విభిన్న పాత్రలలో నటించి మెప్పించిన నటుడు ఆది పినిశెట్టి ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న అఖండ-2లో ప్రతి నాయకుడి పాత్రలో ఆది కనిపించబోతున్నారని సిని వర్గాల్లో సమాచారం అందుతోంది. ఈ విషయం పట్ల చిత్ర బృందం నుంచి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. 

కాగా ఈ సినిమాలో ఆది పినిశెట్టి విలన్ పాత్రను పోషించబోతున్నారట. బోయపాటి శ్రీను తెరకెక్కించిన సరైనోడు సినిమాలో ఆది విలన్ పాత్రలో అద్భుతంగా నటించారు. తన నటనకు ఎన్నో ప్రశంసలు సైతం అందుకున్నారు. ఇప్పుడు తాజాగా ఆఖండ-2 సినిమాలో నటించబోతున్నారని తెలిసి ఆది అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఇది ఇలా ఉండగా.. నందమూరి నటసింహం బాలకృష్ణ..మొన్న సంక్రాంతికి డాకు మహారాజు సినిమాతో సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: