![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_gossips/vd-12-ntrad7d0e54-4e88-40e6-8d63-c5c5c3196501-415x250.jpg)
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తయినట్లే ఈనెల 12న సినిమా టైటిల్ తో పాటు టీజర్ ని కూడా రివీల్ చేస్తామని చిత్ర బృందం వెల్లడించారు. కాగా, ఈ సినిమాలో విజయ్ దేవరకొండ మొట్టమొదటిసారిగా పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు. కేరళలోని కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఇందులో యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే ఫిమేల్ లీడ్ రోల్ లో నటిస్తోంది. ఈ సినిమాకు అనిరుద్ రవిచంద్రన్ సంగీతాన్ని అందించారు.
సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ బ్యానర్లపై సాయి సౌజన్య, నాగ వంశీ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాగా, ఈ సినిమా మార్చి 28న గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. ఇదిలా ఉండగా... విజయ్ నటించిన సినిమాలు వరుసగా ఫ్లాప్ అవుతున్న నేపథ్యంలో తనకు సహాయం చేయడానికి ఎన్టీఆర్ ముందుకు వచ్చారట. అయితే వీడి 12 సినిమా వివిధ భాషల్లో రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఆ టీజర్ కు ఆయా ఇండస్ట్రీలలో ఉన్న స్టార్ హీరోలు వాయిస్ ఓవర్ ఇచ్చినట్లుగా సమాచారం అందుతుంది.
హిందీ టీజర్ కు రణబీర్ కపూర్, తెలుగులో ఎన్టీఆర్, తమిళంలో సూర్య వాయిస్ ఓవర్ ఇచ్చినట్లుగా సమాచారాలు అందుతున్నాయి. తెలుగులో విజయ్ దేవరకొండకు సహాయం చేయడానికి ఎన్టీఆర్ ముందుకు రావడంతో తన అభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం పైన మరింత సమాచారం తెలియాల్సి ఉంది. కాగా, ఈ సినిమా మంచి సక్సెస్ అందుకోవాలని విజయ్ దేవరకొండ అభిమానులు కోరుకుంటున్నారు.