మురారి సినిమాలో చూసిన విధంగా బాలీవుడ్ లో ఓ స్టార్ హీరో కుటుంబంలో 50 సంవత్సరాలకు మించి ఎవరూ జీవించడం లేదు .. ఇలా మూడు తరాలుగా జరుగుతూనే ఉంది . ఇంతకీ ఆ స్టార్ హీరో మరి ఎవరే కాదు బాలీవుడ్ లో ఒకప్పటి ఎవర్ గ్రీన్ హీరో సంజీవ్ కుమార్ .. బాలీవుడ్ ప్రముఖ నటుల్లో సంజీవ్ కుమార్ కూడా ఒకరు .. ఆక ఈయ‌న‌ అసలు పేరు హరిహర్ జెఠలాల్ జరీవాలా .. ఇక ఈయన 1938 జూలై 9న గుజరాత్ లోని సూరత్ లో జన్మించారు .. బాలీవుడ్ లో తన విలక్షణ నటనతో ప్రేక్షకుల మనుస‌లు గెలుచుకున్న సంజీవ్ కుమార్ తన వైవిధ్యమైన పాత్రలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక సీనియర్ హీరో రొమాంటిక్ , కామెడీ విలక్షణ పాత్రలో ఎక్కువ నటించారు..


అలాగే షోలే, ఆంధీ, కోషిష్, దస్తక్, ఖిలాడి, అనామిక, సీతా ఔర్ గీత, త్రిశూల్.ఖిలోనా ,యే నజ్దీకియాన్. వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో సంజీవ్ కుమార్ నటించారు .. అలాగే సంజీవ్ కు ఉత్తమ న‌టుడిగా రెండు జాతీయ చలనచిత్ర అవార్డులు కూడా లభించాయి . సంజీవ్ కుమార్ కేవలం నటుడు గానే కాకుండా నిర్మాతగా కూడా  ఈయ‌న‌ ఎన్నో గొప్ప సినిమాలను నిర్మించారు .  ఈయ‌న‌ ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచారు .. సంజీవ్ కుమార్ తన వ్యక్తిగత జీవితంలో పెళ్లి చేసుకోకుండా ఒంటరిగాన్ని మిగిలిపోయారు. అలాగే సంజీవ్ కుమార్ మరో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ హేమమాలినితో ఎక్కువగా స‌న్నిహితంగా ఉండేవారు .. తర్వాత మరో నటి సులక్షణ పండిట్ తో కూడా ఈయన ఈతో సంబంధం మెయిన్టైన్ చేసేవాడు .. సంజీవ్ కుమార్ పెళ్లి చేసుకోవడానికి నో చెప్పడంతో సులక్షణ పండిట్ కూడా పెళ్లి లేకుండా ఒంటరిగా మిగిలిపోయింది ..


1985లో నవంబర్ 6న సంజీవ్ కుమార్ గుండెపోటు తో ముంబైలో మరణించారు .. ఆయన చనిపోయే నాటికి సంజీవ్ కుమార్ వయసు కేవలం 47 సంవత్సరాలు మాత్రమే .. ఇక సంజీవ్ కుమార్ కి పుట్టుకతోనే గుండెకి సంబంధించిన వ్యాధి ఉండేది .. ఇతనికి 1979లో తొలిసారిగా గుండుపోటు వచ్చింది. ఇక తర్వాత 1985 నవంబర్ 6న గుండుపోటు తో మరణించారు .. ఇక ఇక్కడ మరో విచిత్రం ఏమిటంటే సంజీవ్ కుమార్ కుటుంబంలో 50 ఏళ్లకు మించి ఎవరు జీవించడం లేదు .. సంజయ్ కుమార్ తో పాటు వాళ్లు తాత , తండ్రి , తమ్ముడు , నికుల్ తో సహా అతడి కుటుంబంలోని మగ వారంతా 50 సంవత్సరాలు నిండకుండానే మరణించారు .. ఇక దీంతో ఆ కుటుంబానికి ఏదో శాపం ఉందని అందుకే ఇలా జరుగుతుందని చాలామంది అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: