![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_latestnews/mrunal-thakur-long-gap-movies-russian75c36f37-6867-4af8-8095-ed138e57cdc9-415x250.jpg)
సీత పాత్రలో చెరగని ముద్ర వేసుకున్న ఈ ముద్దు గుమ్మ తన నటనతో అందంతో అందరి చేత శభాష్ అనిపించుకుంది.అందుకు తగ్గట్టుగానే ఆ తర్వాత వరుస పెట్టి సినిమాలలో నటించింది. దీంతో స్టార్ హీరోయిన్లకు పోటీ ఇస్తుంది అనుకున్న సమయంలో కోలీవుడ్ లో కూడా నటుడు శివ కార్తికేయన్ కి జంటగా ఒక సినిమాలో నటించే అవకాశం వచ్చింది. కారణమేంటో తెలియదు కానీ ఆ సినిమాని వదులుకున్నదట. ఆ సమయంలో విజయ్ దేవరకొండ తో చేసిన ఫ్యామిలీ స్టార్ సినిమా భారీ ఫ్లాప్ అయ్యింది.
ఆ తర్వాత కూడా ఇప్పటికీ కోలీవుడ్లో మళ్లీ ఆఫర్ రాలేదట.గ్లామర్ విషయంలో ఎలాంటి కండిషన్స్ సైతం పెట్టకపోయినా ఈ ముద్దుగుమ్మకు సినిమా అవకాశాలు తగ్గాయి అనేది మాత్రం ఇప్పుడు నిజం అనేలా కనిపిస్తోంది. తాజాగా ఈ విషయం పైన మృణాల్ ను ప్రశ్నించగా.. ఈ విషయం పైన మాట్లాడుతూ తాను చేస్తున్న పాత్రలను ఆడియన్స్ ఆదరిస్తున్నారని అందుకే పాత్రల ఎంపిక విషయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకొని మరి అడుగులు వేస్తున్నానని అందుకే సినిమా సినిమాకి అంత మేరకు గ్యాప్ వస్తోంది అంటూ తెలియజేసిందట. మరి రాబోయే రోజుల్లో ఎలాంటి సక్సెస్లు అందుకుంటుందో చూడాలి.