![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_gossips/socialstars-lifestyledb31e1e8-dd08-4da2-a31f-f875f5125f9d-415x250.jpg)
కన్నడ స్టార్ నటుడు శివరాజ్ కుమార్, టాలీవుడ్ ప్రముఖ నటుడు జగపతిబాబు సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు.. భారీ బడ్జెట్ తో సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మూవీ టైటిల్ ను పెద్ది అని ఫిక్స్ చేసినట్లు ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. కానీ మేకర్స్ ఎలాంటి అనౌన్స్మెంట్ మాత్రం ఇవ్వలేదు.ఇదిలావుండగా ఈ సినిమా షూటింగ్ గత ఏడాది చివరిలో కర్ణాటకలోని మైసూరులో మొదలైంది. ప్రస్తుతం హైదరాబాద్ లో ఇండోర్ గేమ్ షెడ్యూల్ ని షూట్ చేస్తున్నారు.అయితే ఈ సినిమా టైటిల్, స్టోరీ విషయంలో రోజుకో వార్త సర్కులేట్ అవుతోంది. అయితే లేటెస్ట్ అప్డేట్స్ ప్రకారం RC16కి పవర్ క్రికెట్ అనే టైటిల్ పరిశీలిస్తున్న సమాచారం. అలాగే గతంలో ఈ సినిమా కర్నూలుకి చెందిన కబడ్డీ ప్లేయర్ బయోపిక్ అని ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు మళ్ళీ క్రికెట్ ఆట స్టోరీ అంటూ పలు వార్తలు బలంగా వైరల్ అవుతోంది. దీంతో RC16 టైటిల్, స్టోరీపై సస్పెన్స్ నెలకొంది. అలాగే త్వరలోనే ఈ సినిమా టైటిల్ అప్డేట్ ఇవ్వాలని మేకర్స్ ని రామ్ చరణ్ ఫ్యాన్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు.