మెగాస్టార్ తనయుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్, రెండో సినిమా ‘మగధీర’తోనే ఇండస్ట్రీ రికార్డులు బ్రేక్ చేశాడు. ‘మగధీర’ వంటి సినిమా తర్వాత ‘ఆరెంజ్’ అంటూ క్లాస్ లవ్ స్టోరీ చేసి, డిజాస్టర్‌ని ఖాతాలో వేసుకున్నాడు.. ‘రంగస్థలం’ మూవీతో రీజినల్ ఇండస్ట్రీ హిట్ సాధించిన రామ్ చరణ్, rrr మూవీ తర్వాత ‘గ్లోబల్ స్టార్’ ట్యాగ్ సొంతం చేసుకున్నాడు. ఈ చిత్రం దేశం కానీ దేశాల్లో ఎలాంటి ప్రభంజనం సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.జపాన్ దేశం లో అయితే ఈ సినిమా ఇప్పటికీ థియేటర్స్ లో ఆడుతూనే ఉంది. అంతే కాకుండా జపాన్ ప్రాంతం లో రామ్ చరణ్ కి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని తెచ్చిపెట్టేలా చేసింది.కేవలం జపాన్ లో మాత్రమే కాదు, అమెరికన్ సిటిజెన్స్ లో కూడా రామ్ చరణ్ మామూలు క్రేజ్ ఏర్పడలేదు. ‘గేమ్ ఛేంజర్’ రిజల్ట్ తేడా కొట్టినా బుచ్చిబాబు సన దర్శకత్వంలో చేస్తున్న సినిమాతో కమ్‌బ్యాక్ ఇవ్వాలని ఆశిస్తున్నాడు రామ్ చరణ్.అయితే రామ్ చరణ్ కెరీర్‌లో చాలా సూపర్ హిట్ సినిమాలను రిజెక్ట్ చేశాడనే విషయం చాలా మంది కి తెలియదు.

అందులో తమిళంలో మణిరత్నం దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ హీరోగా, నిత్యామినన్ హీరోయిన్ గా నటించిన సూపర్ హిట్ మూవీ ‘ఒకే బంగారం’. అలాగే గౌతమ్ వాసుదేవ దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన మూవీ ‘ఏటో వెళ్లిపోయింది మనసు’. ఈ విధంగా నే అఖిల్ హీరోగా తెరకెక్కిన ఏజెంట్.సైరా నరసింహారెడ్డి’ తర్వాత సురేందర్ రెడ్డితో సినిమా చేయాలనుకున్నాడు రామ్ చరణ్.  అలాగే ప్రభాస్ హీరోగా తెరకెక్కిన డార్లింగ్.చరణ్‌కి డార్లింగ్ మూవీ చేయాలనీ చెప్పాడట కరుణాకర్. అయితే అప్పటికే ‘ఆరెంజ్’ మూవీ సైన్ చేయడంతో ‘డార్లింగ్’ మూవీని రిజెక్ట్ చేశాడు రామ్ చరణ్.అలాగే సూర్య హీరోగా తెరకెక్కించిన కల్ట్ క్లాసిక్ మూవీ సూర్య సన్ అఫ్ కృష్ణన్.ఈ సినిమాకి ముందుగా గౌతమ్ మీనన్రాంచరణ్ ని ఫిక్స్ చేసుకున్నాడు. కానీ వరుస ఫ్లాపుల్లో. ఉన్న అతనితో సినిమా చేసేందుకు రామ్ చరణ్ ఆసక్తి చూపించలేదని టాలీవుడ్‌లో టాక్.ఇలా చాలా సినిమాలను వదులుకున్నాడు రాంచరణ్. ప్రస్తుతం రాంచరణ్ rc16 తో బిజీ గా ఉన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: