స్టార్ హీరో ప్రభాస్ ని ఎవరైనా  నేల మీద కూర్చోబెడతారా.. అంత పెద్ద హీరోని అందరి ముందు నేల మీద కూర్చోబెట్టడం ఏంటి? అసలు మిగతా హీరోలు అందరూ సోఫాలో కూర్చొని దర్జాగా తింటే ఆయన్ని మాత్రం కింద నేల మీద ఎందుకు కూర్చోబెట్టారు అని చాలామంది అనుకుంటారు. అయితే ఈ విషయం తెలియాలంటే దీని వెనుక ఉన్న స్టోరీ కూడా తెలుసుకోవాలి.. పూరి జగన్నాధ్ డైరెక్షన్ లో అమితాబ్ బచ్చన్ హీరోగా చేసిన బుడ్డా హోగా తేరీ బాప్ బ్లాక్ బస్టర్ అవ్వడంతో దీనికి సంబంధించి సక్సెస్ మీట్ ని నిర్వహించారట. ఇక ఈ పార్టీ రాత్రి 9:00కి స్టార్ట్ అయితే ఉదయం 4:00 వరకు జరిగిందట. అయితే ఆ పార్టీకి ప్రభాస్ ని కూడా రావాలని పూరీ జగన్నాథ్ ఆహ్వానించడంతో ఆయన వెళ్లారట. అక్కడికి వెళ్ళాక ప్రభాస్ పార్టీ అయిపోయాక ఇంటికి వెళ్తాను డార్లింగ్ అని చెప్పడంతో లేదు లేదు ఇక్కడ రోడ్ సైడ్ ఇడ్లీ బండి దగ్గర ఇడ్లీలు చాలా అద్భుతంగా ఉంటాయి. 

నువ్వు కూడా టేస్ట్ చేయాల్సిందే అని పూరి జగన్నాథ్ చెప్పడంతో మంచి ఫుడీ అయినటువంటి ప్రభాస్ ఓకే అని చెప్పారట. ఆ తర్వాత పూరి జగన్నాథ్ ఆ ఇడ్లీలు తీసుకువచ్చి అక్కడున్న హీరోలు అందరికీ ఇచ్చారట. ఇక అప్పటికే పార్టీలో ఉన్న అందరు హీరోలు సోఫాలో కూర్చొని ఇడ్లీ తింటున్నారట. కానీ ప్రభాస్ కి సోఫాలో కూర్చోడానికి స్థలం లేదు. దాంతో అందరి ముందే కింద కూర్చొని ఇడ్లీ తింటానని చెప్పారట. కానీ అక్కడ ఉన్న వాళ్ళు మాత్రం ఇంత పెద్ద హీరో ఇక్కడ కూర్చుంటే ఏం బాగుంటుంది అని అన్నా కూడా..

లేదు నాకు నేల మీదే కంఫర్ట్ గా ఉంది అని కూర్చుని ఇడ్లీలు తిన్నారట.అయితే ఆరోజు ప్రభాస్ చేసిన పనికి అక్కడున్న వాళ్ళందరూ షాక్ అయ్యారట. ఎందుకంటే మిగతా హీరోలైతే వాళ్లందరూ కాలు మీద కాలు వేసుకుని దర్జాగా సోఫా మీద కూర్చుంటే నేనేమో వాళ్ళ ముందు కింద కూర్చోవాలా అని గోల గోల చేసేవాళ్ళు. కానీ ప్రభాస్ మెంటాలిటీ అలాంటిది కాదు అని పూరి జగన్నాథ్ స్వయంగా ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూ లో  బయటపెట్టారు

మరింత సమాచారం తెలుసుకోండి: