![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_latestnews/allu-arjun5c74cbd9-4b1b-42e8-a5f9-12bb7a598d67-415x250.jpg)
రీసెంట్గా గతంలో రామ్ చరణ్ విషయంలో అల్లు అర్జున్ మాట్లాడిన మాటల తాలూకా వీడియోను బాగా ట్రెండ్ చేస్తున్నారు జనాలు. ఒకేసారి సినిమాలు రిలీజ్ చేయడం వల్ల ఇండస్ట్రీకి చాలా నష్టం వస్తుంది అని గతంలో దాసరి నారాయణరావు గారు బాగా గట్టిగానే మాట్లాడారు . 2015లో రామ్ చరణ్ నటించిన "బ్రూస్లీ" సినిమా.. అదేవిధంగా అనుష్క నటించిన "రుద్రమదేవి" సినిమాలు బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ అయ్యాయి. ఆ టైంలో చాలా టఫ్ కాంపిటీషన్ కూడా ఉండింది. కాగా బ్రూస్లీ సినిమా కారణంగా రుద్రమదేవి సినిమా ఫ్లాప్ అయిపోయింది . ఈ క్రమంలోనే దాసరి నారాయణరావు గారు పండగ మూమెంట్లో సినిమా రిలీజ్ చేయాలి అనుకోవడం మూర్ఖత్వం అని ..
ఏ స్టార్ హీరో సినిమా ఎప్పుడు రిలీజ్ అయిన అది పండగ వాతావరణం క్రియేట్ చేస్తుంది అని . చేతకాని వాళ్లే పండగ మూమెంట్ కోసం వెయిట్ చేస్తారు అని ఘాటుగా మాట్లాడారు . అయితే అదే టైంలో అల్లు అర్జున్ - రామ్ చరణ్ సినిమాకు సపోర్ట్ చేస్తూ మాట్లాడాడు. రామ్ చరణ్ చిత్రాన్ని వెనక్కి నెట్టాలి అనుకోవడం సరైన పద్ధతి కాదు అని.... ఎందుకంటే మూడు నెలల ముందే బ్రూస్లీ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించేసింది అని.. కొన్ని కారణాల చేత రుద్రమదేవి సినిమా పోస్ట్ పోన్ అయ్యి సెప్టెంబర్ లో రిలీజ్ కాలేక ఆ తర్వాత అక్టోబర్లో రిలీజ్ చేశారు అని.. అందువల్లే బ్రూస్లీ చిత్రంతో రుద్రమదేవి అనుకోకుండా క్లాష్అయింది అని చెప్పుకొచ్చారు . ఇందులో ఎవరు తప్పులేదు కాబట్టి ఆలస్యంగా చరణ్ సినిమా రిలీజ్ చేయాలి అనుకోవడం.. అలా చెప్పడం సరైన పద్ధతి కాదు అంటూ కూడా అల్లు అర్జున్ తెలిపారు . అప్పట్లో అల్లు అర్జున్ మాటలను చాలా రాంగ్ గా తీసుకున్నారు జనాలు . దాసరి నారాయణరావు - అల్లు అర్జున్ ల మధ్య వార్ కూడా జరిగినట్లు అప్పట్లో జనాలు మాట్లాడుకున్నారు..!