జూనియర్ ఎన్టీఆర్ అంటే ఎప్పుడు కూడా ఫ్యాన్స్ గురించి ఆలోచించే మనిషి అని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. జూనియర్ ఎన్టీఆర్ పెద్ద స్టార్ హీరో అయినా సరే ఫ్యాన్స్ బాగోగులు చూసుకుంటూ ఏదైనా ఈవెంట్ కి వాళ్ళు వస్తే వాళ్లకు ఏదైనా ప్రమాదం జరుగుతుందేమో అని భయపడి ఒకటికి పది సార్లు ఇంటికి జాగ్రత్తగా వెళ్ళండి వెళ్లండి అని చెప్తూనే ఉంటాడు. ఇది మనం ప్రతి ఈవెంట్ లో చూస్తూనే వస్తున్నాం.  చాలామంది ఇది ఓవర్గా అనుకున్న.. అది ఆయన బాధ్యత అనుకుంటూ ఉంటాడు .


కాగా జూనియర్ ఎన్టీఆర్ ఈ మధ్యకాలంలో సినిమాల విషయంలో ఆలస్యం ఎక్కువగా చేస్తున్నారు . మరి ముఖ్యంగా రెండేళ్లకి ఒక సినిమా రిలీజ్ చేస్తూ ఫ్యాన్స్ ని కూసింత డిసప్పాయింట్ చేస్తున్నారు . అయితే జూనియర్ ఎన్టీఆర్ సినిమా కనీసం సంవత్సరానికి ఒక్కటైన థియేటర్లో రిలీజ్ అయితే బాగుంటుంది అనేది ఫాన్స్ ఒపీనియన్ . ఈ క్రమంలోనే జూనియర్ ఎన్టీఆర్ ఆయన నటించిన సినిమాలు ఇక బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారట .



వార్  2 సినిమా రిలీజ్ అవ్వగానే ఆ తర్వాత వెంటనే దేవర 2 ని కూడా రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారట . అంతేకాదు ఆల్రెడీ ముగ్గురు టాప్ బడా దర్శకులతో సినిమాకి కమిట్ అయ్యాడట . ఈ విషయాలను అఫీషియల్ గా కన్ ఫామ్ చేయబోతున్నారట . ఒకటి కాదు రెండు కాదు బ్యాక్ టు బ్యాక్ మూడు సినిమాలను అనౌన్స్మెంట్ చేయబోతున్నాడు జూనియర్ ఎన్టీఆర్ అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. హైలెట్ ఏంటంటే ఒకే ఏడాదిలో రెండు సినిమాలు రిలీజ్ చేసే విధంగా చేయబోతున్నారట జూనియర్ ఎన్టీఆర్ . తన ఫాన్స్ ఆనందం కోసమే ఇలా చేస్తున్నాడు అని ఆయన కష్టపడుతూ ఫ్యాన్స్ ని ఎంటర్టైన్ చేస్తున్నాడు అని జనాలు మాట్లాడుకుంటున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి: