ఇండస్ట్రీలో ఒక హీరోయిన్ స్పెషల్ సాంగ్ లో నటించడం ..చిందులేయడం..ఎక్స్ పోజ్ చేయడం.. సర్వసాధారణం .. డబ్బు కోసం కావచ్చు ..క్రేజ్ కోసం కావచ్చు . రీజన్ ఏదైనా  సరే ఆ హీరోయిన్స్ అల్లాడించేస్తూ ఉంటారు కొందరు డైరెక్టర్స్. కొందరు హీరోయిన్స్ హీరోయిన్ పాత్రల కన్నా కూడా స్పెషల్ సాంగ్ లోనే బాగా మెరుస్తూ ఉంటారు . అయితే కొందరు హీరోయిన్స్ మాత్రం అస్సలు స్పెషల్ సాంగ్స్ కి పనికిరారు.  అలాంటి ఒక ఫిజిక్ గల అమ్మాయి కీర్తి సురేష్ .


మహానటిగా ఇండస్ట్రీలో పాపులారిటీ సంపాదించుకున్న కీర్తి సురేష్ ట్రెడిషనల్ పాత్రలో మెరిస్తే బాగుంటుంది అనుకుంటారే కానీ ఎక్కడ ఒళ్ళున ఎక్స్పోజ్ చేస్తూ హాట్ హాట్ స్టెప్స్ వేస్తే చూడాలి అని జనాలు కోరుకోరు.  అలాంటి ఒక మంచి ఇంప్రెషన్ కొట్టేసింది కీర్తి సురేష్ . అయితే అలాంటి హీరోయిన్ చేత కూడా స్పెషల్ సాంగ్ చేయించాలి అంటూ కొంతమంది డైరెక్టర్స్ బాగా ఇంట్రెస్ట్ చూపించారట . వాళ్ళల్లో డైరెక్టర్ అనిల్ రావిపూడి కూడా ఉన్నట్లు వార్తలు వినిపించాయి .



'సరిలేరు నీకెవ్వరు' అనే సినిమాని మహేష్ బాబుతో తెరకెక్కించాడు అనిల్ రావిపూడి.  ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది . రష్మిక మందన్నా.. ఈ సినిమాలో హీరోయిన్గా నటించింది . అయితే ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ లో మెరిసింది తమన్నా. ఈ సాంగ్లో ముందుగా కీర్తి సురేష్ ని అనుకున్నారట . కానీ కీర్తి సురేష్ ఆ ఆఫర్ ని రిజెక్ట్ చేసిందట . మొదటి నుంచి స్పెషల్ సాంగ్స్ లో నటించాలి అని కీర్తి సురేష్ అనుకోలేదట . ఆ కారణంగానే కీర్తి ఆఫర్ రిజెక్ట్ చేసింది. రీసెంట్గా నటించిన బాలీవుడ్ సినిమా "బేబీ జాన్" అట్టర్ ఫ్లాప్ అయింది . ఈ సినిమాతో హ్యూజ్ నెగిటివిటీని మూట కట్టుకుంది . అంతేకాదు సోషల్ మీడియాలో హ్యూజ్ ట్రోల్లింగ్  కూడా ఎదుర్కొన్నింది కీర్తి సురేష్ . ఇప్పుడిప్పుడే ఆ ట్రోలింగ్ నుంచి బయటపడడానికి బాగా కష్టపడుతుంది..!

మరింత సమాచారం తెలుసుకోండి: