టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక క్రేజ్ గురించి చెప్పాల్సిన పనిలేదు.. ఈమె చేతిలో బడా ప్రాజెట్స్ సైతం ప్రస్తుతం ఉన్నాయి. దీంతో నిత్యం షూటింగులు ప్రయాణం అంటూ బిజీబిజీగా గడిపేస్తున్నారు. ఇటీవలే రష్మిక కాలికి కూడా గాయం అయ్యింది.. జిమ్ములో వ్యాయామం చేస్తూ ఉండగా కాలు బేసికినట్టుగా తెలియజేసింది.దీంతో రష్మిక నడవలేని స్థితికి జారిపోయింది. దీంతో గత కొంతకాలంగా రష్మిక నడవడం కూడా చాలా కష్టంగా ఉండేది తాజాగా తన కాలిగాయం నుంచి పూర్తిగా కోరుకున్నట్లు తెలియజేస్తోంది.


హైదరాబాద్ విమానాశ్రయంలో ఆమె నడుస్తున్న ఒక వీడియో కూడా షేర్ చేయడం జరిగింది. ఇందులో రష్మిక ఎలాంటి సపోర్టు లేకుండా నడుస్తూ కనిపించడంతో అభిమానులు కూడా చాలా ఆనంద పడుతున్నారు. రష్మిక నటించిన ఛవా సినిమా త్వరలోనే రిలీజ్ కాబోతున్నది ఈ సినిమా ప్రమోషన్స్లో పాల్గొన్నప్పుడు తన కాలికి గాయం కావడం చేత రష్మిక చాలా ఇబ్బందులు పడింది. ముఖ్యంగా ట్రైలర్ లాడ్జ్ ఈవెంట్ లో కూడా రష్మిక వీల్ చైర్కే పరిమితం కావలసిన పరిస్థితి ఏర్పడింది.


రష్మిక వీల్ చైర్ లో ఉండే విషయాన్ని అభిమానులు చూసి జీర్ణించుకోలేకపోయారు. రష్మిక నటించిన ఛవా సినిమా  ఫిబ్రవరి 14న విడుదల కాబోతోంది. ఈ సినిమా ప్రమోషన్స్లో రష్మిక పాల్గొనడానికి సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది. విక్కీ కౌశల్ హీరోగా ఇందులో నటించారు. ఈ సినిమా చారిత్రాత్మక కథాంశంతోనే తెరకెక్కించారు. పుష్ప 2 సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న ఈ ముద్దుగుమ్మ తరువాత విడుదలవుతున్న సినిమా కావడంతో ఈ సినిమా పైన కొంతమేరకు హైప్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి ట్రైలర్ కు కూడా బాగానే స్పందన రావడంతో పాటుగా ఇందులో నటించడం కోసం అటు నటీనటులు కూడా చాలానే కష్టపడినట్టుగా కనిపిస్తోంది. మరి ఏ మేరకు ఛవా చిత్రం విజయాన్ని అందుకుంటుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: