![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_latestnews/-devara-2a60647ed-d84c-4663-8158-36b6541dfa3d-415x250.jpg)
టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర సినిమా గత ఏడాది చివర్లో భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాకు అర్ధరాత్రి మిడ్ నైట్ షోల తర్వాత మిక్స్ డ్ టాక్ వచ్చింది. దేవర సినిమా అంచనాలు అందుకోలేదని ఎన్టీఆర్ అభిమానులు సైతం పెదవి విరిచారు. అలాంటి సినిమా ఎన్టీఆర్ వన్ మ్యాన్ షో చేసి బాక్సాఫీస్ దగ్గర తిరుగులేని సూపర్ డూపర్ హిట్ చేసేశారు. పాన్ ఇండియా స్థాయిలో కూడా దేవర పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా దాదాపు రు. 400 కోట్లకు పైగా వసూళ్లు కొల్లగొట్టింది. అందరికీ భారీ లాభాలు అందించింది. దేవర సినిమాకు సీక్వెల్ గా దేవర పార్ట్ 2 తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సీక్వెల్ పై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం దేవర పార్టు 2 స్క్రిప్ట్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
స్క్రీన్ ప్లే తో పాటు కీలక సన్నివేశాలు ఆసక్తికరంగా మలిచేందుకు డైరెక్టర్ కొరటాల శివ తన టీం తో గత కొద్ది నెలలుగా వర్క్ చేస్తున్నారు. అయితే దేవర 2 సినిమా షూటింగ్ కు సంబంధించి అదిరిపోయే అప్డేట్ బయటకు వచ్చింది. ఏ యేడాది నవంబర్ నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందన్న విషయం బయటకు వచ్చింది. దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఈ వార్త బాగా వైరల్ అవుతుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ కు జోడిగా బాలీవుడ్ ముద్దుగా జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించారు. సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్ర పోషించారు. అనిరుధ్ మ్యూజిక్ అందించారు. అలాగే, ఈ చిత్రంలో శ్రీకాంత్, ప్రకాష్ రాజ్, అజయ్, మురళీ శర్మ ఇతర కీలక పాత్రల్లో నటించారు. అన్నట్టు తాజాగా ‘వార్-2’ షూటింగ్ పూర్తిచేసుకున్న ఎన్టీఆర్, ప్రస్తుతం ప్రశాంత్ నీల్‌తో చేసే సినిమాపై దృష్టి పెట్టారు.