తెలుగు సినిమా ఇండస్ట్రీలో సీనియర్ హీరోల్లో అత్యంత  ఆదరణ పొందిన హీరో ఎవరయ్యా అంటే చాలామంది చిరంజీవి పేరుని ప్రస్తావిస్తారు.. ఆయన ఇప్పటికీ ఆరు పదుల వయసు దాటినా కానీ  కుర్ర హీరోలతో పోటీ పడుతూ మంచి హిట్ అందుకుంటున్నాడు.. అలాంటి చిరంజీవితో సినిమా అంటే ఎవరైనా తప్పకుండా ఒప్పుకొని తీరుతారు. కానీ చిరంజీవే స్వయంగా నేను నీ డైరెక్షన్ లో సినిమా చేస్తాను అంటే  ఆ డైరెక్టర్ నో చెప్పారట.. మరి ఆయన ఎవరు వివరాలు ఏంటో చూద్దాం.. సాధారణంగా చిరంజీవి సినిమా డైరెక్టర్ చేయాలంటే దర్శకులకు కాస్త అదృష్టం ఉండాలని భావిస్తారు. కానీ డైరెక్టర్ బాబీ మాత్రం  ఆయనతో సినిమా అంటే నో చెప్పారట. దానికి కారణం ఏంటి వివరాలు చూద్దాం.. చిరంజీవి బాబీ డైరెక్షన్ లో వాల్తేరు వీరయ్య సినిమా వచ్చి ఎంతటి హిట్ కొట్టిందో మనందరికీ తెలుసు..

 అయితే ఈ మూవీకి ముందు చిరంజీవి బాబి మధ్య పెద్ద కథ నడిచిందట.. మెగాస్టార్ మలయాళ సూపర్ హిట్ చిత్రం లూసిఫర్ ని రీమేక్ చేసిన విషయం అందరికీ తెలిసిందే.. ఈ చిత్రం గాడ్ ఫాదర్ రూపొందింది.. దీన్ని మోహన్ రాజా డైరెక్షన్ చేశారు.. ఈ స్క్రిప్ట్ మోహన్ రాజా దగ్గరికి వెళ్లడానికంటే ముందు దర్శకుడు బాబీ వద్దకు వెళ్లిందట.. కానీ బాబీ  ఈ మూవీ రీమేక్ చేయలేనని చెప్పారట. నాకు సొంత కథ కాకుండా  ఇతరుల కథ సెట్ చేసి చేయడం నావల్ల కాదు అని చెప్పారట..

ఇతరుల కథను నేను ఓన్ చేసుకోలేని  చెప్పారట.. నేను  చిన్నతనం నుంచి చూసే చిరంజీవి వేరు, ఇప్పటి చిరంజీవి వేరు అని చెప్పారట. ఆయన మాటలు విన్న చిరంజీవి చాలా కూల్ గా మాట్లాడుతూ  నన్ను నువ్వు ఎలా చూపించాలి అనుకుంటున్నావో చెప్పు అని అడిగారట.. వెంటనే బాబీ వాల్తేరు వీరయ్య కథ చెప్పడంతో  ఫిదా అయిపోయి దానికి ఓకే చెప్పడం చకచకా షూటింగ్ జరగడం  సినిమా రిలీజ్ అయి సూపర్ హిట్ అవ్వడం అవన్నీ జరిగాయట..

మరింత సమాచారం తెలుసుకోండి: