అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పుష్ప 2 ది రూల్‌’. డిసెంబర్‌ 5న విడుదలైన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.1800 కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది. ఈ సినిమా విడుదలైన రోజు చోటుచేసుకున్న పరిణామాల రీత్యా చిత్రబృందం సక్సెస్‌ మీట్‌ నిర్వహించలేదు. ఈ నేపథ్యంలో చిత్ర బృందం థాంక్స్‌ మీట్‌ ఏర్పాటు చేసింది. ఈ క్రమంలోఈ ఈవెంట్ కు రష్మిక మందన్న అందులో పాల్గొనలేకపోయింది.ఈ క్రమంలో రష్మిక తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఒక పోస్ట్‌ను షేర్ చేసింది. ఇందులో నేషనల్ క్రష్ ..'నిన్న జరిగిన 'పుష్ప 2 థాంక్యూ మీట్'లో నేను పాల్గొనలేకపోయాను. కానీ,నేడు కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నా. సుకుమార్‌ సర్‌, అల్లు అర్జున్‌, మైత్రి మూవీ మేకర్స్‌ సంస్థకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. నాకు ఇంత అద్బుతమైన సినిమా నటించే అవకాశం కల్పించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు.అలాగే,'శ్రీవల్లిగా చెప్పాలంటే.. మీకు ఎల్లప్పుడూ నా హృదయంలో ప్రత్యేక స్థానం ఉంటుంది. ఈ సినిమా కోసం మా సర్వస్వం ధారబోశాం. సినిమాను అద్భుతంగా తీయడానికి కష్టపడ్డాం. ఈ ప్రయాణంలో నన్ను భాగం చేసినందుకు, నాకు ఎప్పటికీ గుర్తుండిపోయే ప్రత్యేకమైన రోల్‌ ఇచ్చినందుకు నేను ఎప్పుడూ కృతజ్ఞురాలిని. అలాగే మూవీ టీం అందరికీ ధన్యవాదాలు అంటూ ఎమోషనల్ పోస్ట్ చేసింది.

ఇదిలావుండగా గతేడాది డిసెంబర్ 5నగ్రాండ్ రిలీజ్ అయినా ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేసింది. తొలిరోజు బాక్సాఫీస్ వద్ద ఎప్పుడు లేని విధంగా రికార్డులను తిరగరాసింది. ఈ మూవీ ఏకంగా ఆర్ఆర్ఆర్, బాహుబలి-1, బాహుబలి-1, కేజీఎఫ్ చిత్రాల రికార్డులను అధిగమించింది. ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ ‍అవుతోంది. వరల్డ్‌ వైడ్‌గా పలు దేశాల్లో టాప్‌లో ట్రెండ్ అవుతోంది.ఇదిలావుండగా తాజాగా నేషనల్ క్రష్ రష్మిక మందన్న.బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్ చావాసినిమాలో హీరోయిన్ నటిస్తోంది. ఈ మూవీకి లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించారు. ఈ మూవీని దివ్యంజలి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై దినేష్ విజయన్ నిర్మిస్తున్నారు. ఛత్రపతి శివాజీ మహరాజ్‌ కుమారుడు శంభాజీ మహరాజ్‌ జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో అక్షయ్‌ ఖన్నా, అశుతోష్ రాణా, దివ్య దత్తా తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అయితే ఈ మూవీ ఫిబ్రవరి 14న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: