గ్లోబ‌ల్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ హీరోగా ఉప్పెన ఫేం బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న సినిమా 'ఆర్‌సీ 16'. ప్ర‌స్తుతం ఈ మూవీ షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. చ‌ర‌ణ్‌తో పాటు చిత్రంలోని ఇత‌ర ప్ర‌ధాన తారా‌గ‌ణంపై కీల‌క స‌న్నివేశాల‌ను బుచ్చిబాబు తెర‌కెక్కిస్తున్నారు. అయితే, ఈ చిత్రం క‌థ ఇదేనంటూ ఇప్ప‌టికే నెట్టింట ఊహ‌గానాలతో కూడిన‌ ఎన్నో క‌థ‌నాలు వ‌చ్చాయి. ఈ సినిమాను కోడి రామ్మూర్తి జీవిత క‌థ ఆధారంగా తీస్తున్నార‌ని తొలుత ప్ర‌చారం కూడా న‌డిచిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో తాజాగా 'ఆర్‌సీ 16' క‌థ గురించి సినిమాటోగ్రాఫ‌ర్ ర‌త్నవేలు 'ఎక్స్'  వేదిక‌గా హింట్ ఇచ్చారు. రాత్రుళ్లు షూటింగ్‌, ఫ్ల‌డ్ లైట్లు, ప‌వ‌ర్ క్రికెట్, విచిత్ర కోణాలు అంటూ ఆయ‌న పోస్ట్  చేశారు. దీంతో రెండు ఊళ్ల మ‌ధ్య జ‌రిగే క్రికెట్ ఆధారంగా సినిమా క‌థ ఉంటుంద‌ని అభిమానులు చ‌ర్చించుకుంటున్నారు. ఇక నెగెటివ్ కెమెరా, ఫిల్మ్ కెమెరాలతో కొంత పార్ట్ షూటింగ్ చేస్తున్నామని రత్నవేలు ఆల్రెడీ లీక్ ఇచ్చారు. ఆ సీన్లు ఎంతో రా గా, సహజత్వానికి దగ్గరగా ఉంటాయని సినిమాటోగ్రాఫ‌ర్ చెప్పిన సంగతి తెలిసిందే. ఇదిలావుండగా రత్నవేలు గతంలోనూ ఈ సినిమా గురించి చేసిన ఓ పోస్ట్ అందరిలోనూ ఆసక్తి రేకెత్తించింది. ఇందులోని ఓ సీక్వెన్స్‌ కోసం నెగిటివ్ రీల్ ఉపయోగించనున్నట్లు తెలిపారు.అలాగే అటు, దర్శకుడు బుచ్చిబాబు ఈ సినిమా కోసం దాదాపు రెండేళ్ల నుంచి వర్క్ చేస్తున్నారు. గ్రామీణ నేపథ్యంలో సాగే 'RC 16' కథలో రామ్ చరణ్ పాత్ర పవర్ ఫుల్‌గా ఉండనున్నట్లు తెలుస్తోంది. సినిమాలో జాన్వీకపూర్ హీరోయిన్ కాగా.. కన్నడ స్టార్ శివ రాజ్ కుమార్, జగపతిబాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు కలిపి ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. మరోవైపు, ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే మ్యూజిక్ వర్క్స్ ప్రారంభమయ్యాయని.. 2  పాటలు కూడా పూర్తి చేసినట్లు ఇటీవలే రెహమాన్ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: