![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_latestnews/uttarakanda-excm-ramesh-arushi-sushank-chetting-4cros-produsers2e847d51-954d-42ae-8fa8-d0595ebc9206-415x250.jpg)
తన దగ్గర నుంచి నాలుగు కోట్ల రూపాయలు తీసుకున్నారంటు దీంతో డెహ్రాడూన్ లోని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చిందట. నిర్మాతల పైన నాలుగు కోట్ల రూపాయల చీటింగ్ తో పాటు మానసిక హింస, బెదిరింపులకు కూడా పాల్పడినటువంటి కేసులను కూడా వీరి మీద నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఆరుషి ఇంటికి నిర్మాతలు వచ్చారని తాము ఏకా ఫిలిం ప్రొడక్షన్ లిమిటెడ్ డైరెక్టర్లమంటూ తెలియజేశారట. ప్రస్తుతం వారు ఆంఖో కి గుస్తాఖియాన్ అనే సినిమాని నిర్మిస్తున్నామంటూ తెలిపారట. ఇందులో షానయా కపూర్ నటిస్తున్నారని అలాగే విక్రాంత్ మాన్సే కీలకమైన పాత్రలో నటిస్తున్నట్లు తెలియజేశారట.
అయితే ఈ చిత్రంలో తను నటించాలంటే ఐదు కోట్లు పెట్టుబడి పెడితే చాలని ఇందులో లాభాలతో పాటుగా తాను కూడా నటిస్తారని నిర్మాతలు మాజీ సీఎం ముఖ్యమంత్రి ఆరుషి కి తెలిపారట.ఒకవేళ తనకు పాత్ర నచ్చకపోయినా సంతృప్తి చెందకపోయినా ఆమె చెల్లించిన డబ్బులు మొత్తానికి 15% వడ్డీతో కలిపి తిరిగి ఇస్తామంటూ ఆ ఇద్దరి నిర్మాతలు వెల్లడించారట. తన దగ్గరికి వచ్చి కథ కూడా చెప్పలేదని దీంతో ఆమె తిరిగి డబ్బు అడిగినప్పుడు సినిమా షూటింగ్ భారతదేశంలోనే పూర్తి అయ్యిందని ప్రస్తుతం ఇప్పుడు యూరప్ లో జరుగుతోందంటూ ఆమెకు వెల్లడించారట. దీంతో ఆమె వెంటనే పోలీస్ స్టేషన్కు వెళ్లి మరి ఫిర్యాదు చేసిందట.