మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన లేటెస్ట్ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘లైలా’.. రామ్ నారాయణ్ తెరకెక్కించిన ఈ సినిమాలో ఆకాంక్ష శర్మ హీరోయిన్ గా నటించింది.. 'లైలా' సినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి నిర్మించారు.విశ్వక్ సేన్ తన సినిమాలను ఎప్పుడూ డిఫరెంట్ గా ప్రమోట్ చేస్తూ వుంటాడు.. ఆయన సినిమా ఫంక్షన్స్ కి స్టార్ హీరోస్ కచ్చితంగా వస్తారు.. అది కూడా మాక్సిమమ్ నందమూరి కాంపౌండ్ నుంచే వస్తారు.. విశ్వక్ సేన్ కు ఎన్టీఆర్ అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఎన్టీఆర్ నటించిన ఏ సినిమా రిలీజ్ అయిన విశ్వక్ సేన్ చేసే హంగామా వేరు ఉంటది.. అలాగే బాలయ్య అంటే విశ్వక్ కు ఎంతో అభిమానం.. బాలయ్య కూడా విశ్వక్ పై ఎంతో ప్రేమ చూపిస్తూ ఉంటాడు.. 

అయితే ఎప్పుడూ నందమూరి హీరోలతో తన సినిమాలను ప్రమోట్ చేయించుకునే విశ్వక్ తాజాగా లైలా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ గా  మెగాస్టార్ చిరంజీవిని ఇన్వైట్ చేసాడు..ఈ గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హాజరైన మెగాస్టార్ సినీ నటుల ఫ్యాన్స్ ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు.టాలీవుడ్ ఇండస్ట్రీ లోనే కాదు ఏ ఇండస్ట్రీలో అయినా సరే హీరోలంతా బానే ఉంటారు.. కానీ ఫ్యాన్స్ మాత్రం ఒకరి ఫ్యాన్స్ పై ఒకరు ద్వేషం పెంచుకుంటున్నారు అని చిరంజీవి అన్నారు. అంతేకాదు.. బాలకృష్ణ ఫ్యాన్ సినిమా అయితే నేను రాకూడదా? అని చిరంజీవి షూటిగా ప్రశ్నించారు. 

ఇండస్ట్రీ అంతా ఒకటే కాంపౌండ్ అని చిరంజీవి స్పష్టం చేశారు.ఇండస్ట్రీలో అంతా కుటుంబసభ్యులుగా ఉంటారని ఆయన అన్నారు.విశ్వక్ సేన్ ఫంక్షన్‌కి నువ్వు వెళ్తున్నావా.. అతను మన మనిషి కాదు.. బాలకృష్ణ కాంపౌండ్.. అప్పుడప్పుడు తారక్ కూడా అంటూ ఉంటాడు అని నాకు కొన్ని మాటలు వినిపించాయి.. అలాంటి వారికీ నేనొకటే చెప్పా.. మనిషి అన్నాక వేరే వాళ్ళ మీద ప్రేమ ఆప్యాయత ఉంటాయి కదా..అంతెందుకు మా అబ్బాయి రాంచరణ్ కు సూర్య అంటే చాలా ఇష్టం..నేను చరణ్ ఫంక్షన్స్ కి వెళ్లడం లేదా..ఇలాంటి ఫంక్షన్స్ కు వస్తే నాకు చాలా ఎనర్జీ వస్తుందని మెగాస్టార్ అన్నారు.. ఇండస్ట్రీ లో అంతా ఒకటే అని మెగాస్టార్ స్పష్టం చేసారు..

మరింత సమాచారం తెలుసుకోండి: