ఏంటి విశ్వక్ సేన్ కారు ఆ హీరో వల్ల తగలబడిపోయిందా.. ఇంతకీ ఎవరివల్ల విశ్వక్ సేన్ వాళ్ళ కారు మంటల్లో కాలిపోయింది అనేది ఇప్పుడు చూద్దాం. విశ్వక్ సేన్ తాజా మూవీ లైలా.. ఈ సినిమా ఫిబ్రవరి 14 విడుదలకు సిద్ధంగా ఉండడంతో తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఘనంగా జరిపారు చిత్ర యూనిట్.అయితే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్ గా వచ్చిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఇన్ని రోజులు నందమూరి కాంపౌండ్ లో తిరిగిన విశ్వక్ సేన్ మెగా కాంపౌండ్లోకి ఎందుకు వెళ్లారు అంటూ ఎన్నో వార్తలు వినిపిస్తాయి. కానీ ఇండస్ట్రీలో అంతా ఒక్కటేనని కంపౌండ్ అంటూ ఏమీ ఉండదు అంటూ చిరంజీవి తో పాటు విశ్వక్ సేన్ కూడా గట్టిగా చెప్పారు. అయితే లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్లో విశ్వక్ సేన్ చేసిన కామెంట్లు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. విశ్వక్సేన్ మాట్లాడుతూ.. చిరంజీవికి మా నాన్న వీరాభిమాని..

ఆయన మీద ఉన్న అభిమానంతో మా నాన్న ప్రజారాజ్యం పార్టీలో చేరారు. అయితే అప్పట్లో మేము చిరంజీవి గారి అభిమానులుగా ఉండడం వల్ల మా ఇంటి వెనుక ఉండే కారుని మంటల్లో కాల్చేశారు  అయితే కారు కాలిపోయింది అని భయంతో మేమందరం బిక్కుబిక్కుమని ఇంట్లో కూర్చున్న టైం లో సడన్గా మాకు ఫోన్ కాల్ వచ్చింది. ఎవరు చేసారో అని నేను ఫోన్ లిఫ్ట్ చేసేసరికి ఫోన్లో చిరంజీవి గారు... వెంటనే చాలా సర్ప్రైజింగ్ గా ఫీలయ్యాను. అయితే ఆ టైంలో మా కారు కాలిపోయినా కూడా నాకు హ్యాపీగానే అనిపించింది. ఎందుకంటే కారు కాలిపోతే కాలిపోయింది కానీ మాకు చిరంజీవి గారు డైరెక్ట్ గా కాల్ చేయడంతో అదే మాకు పెద్ద గిఫ్ట్ అయింది అంటూ విశ్వక్సేన్ చిరంజీవి కుటుంబంతో ఉన్న అనుబంధాన్ని బయట పెట్టారు.

అలాగే అదే స్టేజ్ మీద తన ఫ్రెండ్స్ గురించి మాట్లాడుతూ..ఈరోజుల్లో డబ్బున్న వాళ్ళు ధనవంతులు కాదు. మానసికంగా ప్రశాంతంగా ఉండే వాళ్ళే అసలైన ధనవంతులు.ఇక ఈ ప్రశాంతత లేక మానసిక ఒత్తిడికి గురైన ఇద్దరు ఫ్రెండ్స్ చనిపోయారు.అందుకే బతికున్నంత కాలం ఎలాంటి ఒత్తిడిలకు లోనవ్వకుండా ప్రశాంతమైన జీవితం గడపాలి..అంటూ విశ్వక్ సేన్ చెప్పుకొచ్చారు. అలాగే లైలా మూవీ కోసం దాదాపు ముగ్గురు నలుగురు హీరోలను అడిగినప్పటికీ ఎవరు ఒప్పుకోలేదట.ఇక నా దగ్గరికి కథ చెప్పడానికి డైరెక్టర్ వస్తారంటే ఆయన అస్సలు ఒప్పుకోరు అని చెప్పారట.కానీ నేను మాత్రం ఈ సినిమాకి ఒప్పుకున్నాను అంటూ లైలా మూవీ గురించి చిరంజీవి గారితో ఉన్న అనుబంధం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు విశ్వక్ సేన్.

మరింత సమాచారం తెలుసుకోండి: