తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పరచుకున్న వారిలో అక్కినేని నాగ చైతన్య ఒకరు. ఇకపోతే నాగ చైతన్య తాజాగా తండెల్ అనే సినిమాలో హీరో గా నటించాడు. సాయి పల్లవిమూవీ లో హీరోయిన్గా నటించగా ... చందు మండేటి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ఫిబ్రవరి 7 వ తేదీన తెలుగు , తమిళ్ , హిందీ భాషలలో విడుదల అయింది. ఇకపోతే ఈ మూవీ కి మంచి టాక్ రావడంతో ప్రస్తుతం ఈ సినిమా అద్భుతమైన కలెక్షన్లను వసూలు చేస్తుంది.

ఇది ఇలా ఉంటే రెండవ రోజు టైర్ 2 హీరోలు నటించిన సినిమాల కలెక్షన్ల విషయంలో తండెల్ మూవీ అద్భుతమైన రికార్డును సృష్టించింది. రెండవ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి తంల్ మూవీ కి 7.42 కోట్ల షేర్ కలక్షన్లు వచ్చాయి. ఇప్పటి వరకు టాలీవుడ్ ఇండస్ట్రీ కి సంబంధించిన టైర్ 2 హీరోలలో ఏ హీరో నటించిన మూవీ కి కూడా విడుదల అయిన రెండవ రోజు ఈ స్థాయి కలెక్షన్లు రాలేదు.

తండెల్ మూవీ తర్వాత స్థానంలో సిద్దు జొన్నలగడ్డ హీరోగా రూపొందిన టిల్లు స్క్వేర్ 7.36 కోట్ల కలెక్షన్లతో కొనసాగుతూ ఉండగా , ఆ తర్వాత ఉప్పెన మూవీ 6.86 కోట్ల కలెక్షన్లతో మూడవ స్థానంలోనూ , దసరా సినిమా 5.86 కోట్ల కలెక్షన్లతో నాలుగవ స్థానంలోనూ , విరూపాక్ష సినిమా 5.80 కోట్ల కలెక్షన్లతో 5 వ స్థానం లోనూ , ఖుషి సినిమా 5.36 కోట్ల కలెక్షన్లతో ఆరవ స్థానం లోనూ , లవ్ స్టోరీ సినిమా 5.08 కోట్ల కలెక్షన్లతో ఏడవ స్థానంలోనూ , మజిలీ మూవీ 4.98 కోట్ల కలెక్షన్లతో ఎనిమిదవ స్థానంలోనూ , మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీ 4.51 కోట్ల కలెక్షన్లతో 9 వ స్థానంలోనూ , బింబిసార మూవీ 4.52 కోట్ల కలెక్షన్లతో పదవ స్థానం లోనూ కొనసాగుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Nc