ఐశ్వర్య రాజేష్ .. నిన్న మొన్నటి వరకు చక్కని హీరోయిన్ ..అందాల ముద్దుగుమ్మ అంటూ పిలుచుకున్నారు . అసలు కల్మషం లేని హీరోయిన్ అంటూ కూడా చాలా మంది పొగిడేసారు . సీన్ కట్ చేస్తే సీన్ ఇప్పుడు మొత్తం రివర్స్ అయిపోయింది . ఐశ్వర్య రాజేష్ ది ఇలాంటి క్యారెక్టర్ నా..? అంటూ ఘాటు ఘాటుగా ఫైర్ అయిపోతున్నారు కొంతమంది జనాలు . "సంక్రాంతికి వస్తున్నాం" సినిమాలో భాగ్యం పాత్రలో ఎంత బాగా నటించి మెప్పించింది అన్న విషయం అందరికీ తెలుసు . వెంకటేష్ భార్యగా అదరగొట్టేసింది . వెంకటేష్ సౌందర్య హిట్ పెయిర్ ని వెంకటేష్ ఐశ్వర్య రాజేష్ గా మార్చేసింది. దీంతో అందరూ ఆమెను సౌందర్య ప్లేస్ ని రీప్లేస్ చేసే బ్యూటీ అంటూ తెగ పొగిడేసారు .


ఐశ్వర్య రాజేష్ కూడా చాలా చక్కగా మాట్లాడింది నటించింది . అయితే ఆమె ఈ సినిమా హిట్ అయిన తర్వాత మాత్రం రెమ్యూనరేషన్ పెంచేసిందట.  అంతకుముందు కోటి.. కోటి 50 లక్షలు ఈ విధంగానే రెమ్యూనరేషన్ తీసుకునేదట . కానీ సంక్రాంతికి వస్తున్నాం సినిమా హిట్ అవ్వడం 100 కోట్లు క్రాస్ చేయడం సినిమాకి హ్యూజ్ ప్రాఫిట్స్ రావడం..  పైగా సినిమా మొత్తానికి భాగ్యం పాత్ర హైలెట్ కావడంతో ఐశ్వర్య రాజేష్ తన రెమ్యూనరేషన్ భారీగా పెంచేస్తుందట.



ఇప్పుడు ఆమె దగ్గరికి వెళుతున్న మేకర్స్ కు ఒక్కొక్క సినిమాకి ఐదు కోట్లు రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తుందట . ఇది టోటల్గా ఐదు రెట్లు పెంచినట్టే అంటున్నారు సినీ మేకర్స్ . ఇది చాలా చాలా దారుణం అని కూడా జనాలు మాట్లాడుకుంటున్నారు . అంతేకాదు ఐశ్వర్య రాజేష్ ఇన్నాళ్లు మంచిది అనుకున్నామని హిట్ పడగానే ఆమెలోనే ఒరిజినల్ హీరోయిన్ క్యారెక్టర్ బయటపడింది అని ప్రతి హీరోయిన్ కూడా ఇలాగే బిహేవ్ చేస్తుంది అంటూ జనాలు ఘాటుఘటుగా మాట్లాడుకుంటున్నారు . సోషల్ మీడియాలో ప్రజెంట్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ పేరు మారు మ్రోగిపోతుంది. హ్యూజ్ రేంజ్ లో ట్రోల్లింగ్ కి గురవుతుంది . కొంతమంది ఐశ్వర్య రాజేష్ క్యారెక్టర్ అలాంటిది కాదు అని ఎవరో కావాలనే ఆమెకు నెగిటివిటీని మూటగడుతున్నారు అని మాట్లాడుతున్నారు . దీనిపై ఐశ్వర్యరాజేష్ స్పందిస్తేనే అసలు నిజానిజాలు బయటపడతాయి అంటున్నారు అభిమానులు..!

మరింత సమాచారం తెలుసుకోండి: