యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అయితే జూనియర్ ఎన్టీఆర్ ఈ స్థాయికి చేరుకోవడం వెనుక ఎంతో కష్టం ఉంది. ఎన్నో అవమానాలు, ఎన్నో ఎదురుదెబ్బలు ఎదుర్కొని తారక్ ఈ స్థాయికి చేరుకోవడం జరిగింది. బాల్యంలో తాత సపోర్ట్ దక్కినా తాత మరణం తర్వాత జూనియర్ ఎన్టీఆర్ కు నందమూరి ఫ్యామిలీ నుంచి సపోర్ట్ దక్కలేదు.
 
తొలి సినిమా నిన్ను చూడాలని బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోకపోవడం, నిన్ను చూడాలని మూవీ సమయంలోనే తారక్ లుక్స్ గురించి విమర్శలు రావడం జరిగింది. సింహాద్రి తర్వాత వరుస ఫ్లాపులు తారక్ కెరీర్ పై ఊహించని స్థాయిలో ప్రభావం చూపాయని చెప్పడంలో సందేహం అవసరం లేదు. జూనియర్ ఎన్టీఆర్ కు 2004 నుంచి 2006 వరకు 2011 నుంచి 2014 వరకు వరుస ఫ్లాపులు వెంటాడాయి.
 
సాధారణంగా వరుస ఫ్లాపులు ఎదురైతే ఏ హీరో అయినా నిరాశ చెందుతారు. మళ్లీ పూర్వ వైభవం సాధించడం కూడా ఆ హీరోలకు ఒక విధంగా కష్టం అవుతుందని చెప్పవచ్చు. అయితే జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఎన్ని ఎదురుదెబ్బలు తగిలినా కెరీర్ పరంగా వెనుకడుగు వేయకుండా ముందుకు వచ్చారు. జూనియర్ ఎన్టీఆర్ టాలెంట్ కు తగ్గ సినిమాలు పడలేదని ఫ్యాన్స్ భావిస్తారు.
 
సరైన ప్రాజెక్ట్ పడి ఉంటే జూనియర్ ఎన్టీఆర్ ఈపాటికే టాలీవుడ్ నంబర్ వన్ హీరోల రేంజ్ లో ఉండేవారు. అయితే అన్ని లక్షణాలు ఉన్నా ఎన్టీఆర్ కు అదృష్టం మాత్రం ఒకింత తక్కువగానే ఉందనే చెప్పాలి. సరైన ప్రాజెక్ట్ లను ఎంచుకుని తారక్ కెరీర్ పరంగా ఊహించని స్థాయిలో సంచలనాలను సృష్టిస్తే ఫ్యాన్స్ సంతోషానికి అవధులు ఉండవు. ఎన్టీఆర్ భవిష్యత్తు సినిమాలపై భారీగానే అంచనాలు ఏర్పడ్డాయి. ఎన్టీఆర్ రేంజ్ అంతకంతకూ పెరుగుతోంది.




మరింత సమాచారం తెలుసుకోండి: