ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా పుష్ప పార్ట్ 2 అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించి అదిరిపోయే రేంజ్ సాలిడ్ విజయాన్ని అందుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే పుష్ప పార్ట్ 2 మూవీ విడుదల కాకముందు నుండే అల్లు అర్జున్ తన తదుపరి మూవీ ని కోలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరు అయినటువంటి అట్లీతో మూవీ చేసే అవకాశాలు ఉన్నాయి అని అనేక వార్తలు వచ్చాయి. ఆ వార్తలకు తగినట్లుగానే అల్లు అర్జున్ స్వయంగా చెన్నై వెళ్లి మరి అట్లీ ని కలిశాడు అని , వారి మధ్య స్టోరీ డిస్కర్షన్ కూడా జరిగింది అని , ఆల్మోస్ట్ వీరి కాంబోలో సినిమా సెట్ అయినట్లే అని వార్తలు వచ్చాయి.

కానీ ఆ తర్వాత మాత్రం అల్లు అర్జున్ తో సినిమా చేయడానికి అట్లీ ఏకంగా 100 కోట్ల పారితోషకం అడుగుతున్నాడు అని , అంత పారితోషకం వర్కౌట్ కాదు అనే ఉద్దేశంతో మేకర్స్ ఈ సినిమా నుండి తప్పుకున్నారు అని ఓ వార్త వైరల్ అయింది. ఆ తర్వాత అల్లు అర్జున్ "పుష్ప పార్ట్ 2" సినిమా తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమా చేయనున్నాడు అని అట్లీ తో సినిమా ఇప్పట్లో లేనట్లే అనే వార్తలు వచ్చాయి. ఇకపోతే మళ్ళీ తాజాగా అల్లు అర్జున్ , అట్లీ కాంబినేషన్ మూవీ న్యూస్ తెరపైకి వచ్చింది. ప్రస్తుతం వస్తున్న వార్తల ప్రకారం అట్లీ ఇప్పటికే అల్లు అర్జున్ కి ఓ కథను వినిపించినట్లు , అది బాగా నచ్చడంతో అట్లీ దర్శకత్వంలో సినిమా చేయడానికి బన్నీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు మరికొన్ని రోజుల్లోనే ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఇకపోతే ఈ సినిమాను సన్ పిక్చర్స్ బ్యానర్ వారు భారీ బడ్జెట్ తో నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే అల్లు అర్జున్ , అట్లీ ఇద్దరికీ కూడా పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ ఉంది. దానితో వీరి కాంబోలో సినిమా కనుక రూపొందినట్లయితే ఆ మూవీ పై భారీ అంచనాలు ప్రేక్షకుల్లో నిలకొనే అవకాశం చాలా వరకు ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: