టాలీవుడ్ ఇండస్ట్రీ లో సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం మల్లాడి వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న విశ్వంభర అనే సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ తర్వాత చిరంజీవి , అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు. ఈ మూవీ ని సాహు గారపాటి నిర్మించబోతున్నాడు. ఇప్పటికే ఈ విషయంపై అనేక సార్లు అనిల్ రావిపూడి , సాహు గారపాటి స్పందించారు.

ఇంత కాలం పాటు చిరంజీవి మాత్రం ఈ సినిమా గురించి పెద్దగా స్పందించలేదు. ఇకపోతే తాజాగా విశ్వక్ సేన్ "లైలా" అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాను ఫిబ్రవరి 14 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ ని సాహో గారపాటి నిర్మించారు. ఇక నిన్న ఈ మూవీ బృందం ఈ సినిమాకు సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించింది. ఇక ఈ మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి , అనిల్ రావిపూడి ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఇక ఈ ఈవెంట్ లో భాగంగా చిరంజీవి మాట్లాడుతూ ... నా తదుపరి మూవీ ని అనిల్ రావిపూడి దర్శకత్వంలో సాహూ గారపాటి నిర్మాణంలో చేయబోతున్నాను. ఈ సినిమా నా పాత సినిమాల మాదిరిగా ఉండబోతుంది. అందులో అద్భుతమైన కామెడీ ఉండబోతోంది.

ఇప్పటికే ఆ సినిమాకు సంబంధించిన కొన్ని సన్నివేశాలను అనిల్ నాకు చెప్పాడు ... అవి అద్భుతంగా అనిపించాయి. ఎప్పుడు సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుందా అని ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నాను. ఈ మూవీ షూటింగ్ ఈ సంవత్సరం సమ్మర్ లో స్టార్ట్ కాబోతోంది అని చిరంజీవి చెప్పాడు. ఇలా చిరు తన నెక్స్ట్ మూవీ కి సంబంధించిన అనేక విషయాలను చెప్పడంతో ప్రస్తుతం మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: