ప్రజారాజ్యం పార్టీ జనసేనగా రూపాంతరం చెందిందని మెగాస్టార్ చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో ప్రజారాజ్యం పార్టీ కోసం పని చేసిన వారందరూ... ఇప్పుడు జనసేన కోసం పనిచేస్తున్నారని గుర్తు చేశారు చిరంజీవి. విశ్వక్సేన్ హీరోగా చేసిన సినిమా లైలా. ఈ సినిమా లవర్స్ డే సందర్భంగా అంటే ఫిబ్రవరి 14వ తేదీన రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో తాజాగా లైలా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక గెస్ట్ గా వచ్చారు.


 ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మెగాస్టార్ చిరంజీవి. ప్రజారాజ్యం పార్టీ జనసేన గా రూపాంతరం చెందిందని తెలిపారు. విశ్వక్సేన్ తండ్రి రాజు ప్రజారాజ్యం పార్టీ నేతగా చాలా రోజులు పని చేశారని గుర్తు చేసుకున్నారు.  దాదాపు 15 నుంచి 18 సంవత్సరాల పాటు విశ్వక్  కుటుంబంతో తనకు సంబంధాలు ఉన్నాయని వెల్లడించారు. అందుకే ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు రావడం జరిగిందని గుర్తు చేసుకున్నారు. దీంతో అక్కడే ఉన్న ఫ్యాన్స్ అందరూ జై జనసేన అంటూ నినాదాలు కూడా చేశారు.


 జనసేన పార్టీ పట్ల తాను ఎంతో సంతోషంగా ఉన్నానని కూడా మెగాస్టార్ చిరంజీవి చెప్పడం జరిగింది. ఆ తర్వాత... ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు రావడం పట్ల కూడా స్పందించారు మెగాస్టార్ చిరంజీవి. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆ వర్గాలు అలాగే ఈ వర్గాలు ఉన్నాయని కొంతమంది ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కష్టపడి పైకి వచ్చిన వారికి కచ్చితంగా సక్సెస్ ఉంటుందని తెలిపారు.


 తాను ఏ వర్గం కాదని... టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎలాంటి విభేదాలు లేవని కూడా తెలిపారు. అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా గ్రాండ్ విక్టరీ కొట్టిందని మెగాస్టార్ చిరంజీవి వివరించారు. అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 రికార్డులు సృష్టించడం పట్ల తాను ఎంతో సంతోషంగా గర్వపడుతున్నట్లు... ఎమోషనల్ అయ్యారు మెగాస్టార్ చిరంజీవి. అలాంటి సినిమాలు వస్తే ప్రతి ఒక్కరు అభినందించాల్సిందేనని స్పష్టం చేశారు. ప్రతి హీరో తనకు సమానమే అని వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: