తెలుగు సినీ పరిశ్రమలో డిస్ట్రిబ్యూ టర్ గా , నిర్మాతగా మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో దిల్ రాజు ఒకరు . ఈయన ఇప్పటి వరకు తన కెరీర్ లో ఎన్నో సినిమాలుకు డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరించాడు. అలాగే మరెన్నో సినిమాలను నిర్మించాడు. ఇకపోతే తాజాగా ఓ ఇంటర్వ్యూలో భాగంగా దిల్ రాజు మాట్లాడుతూ ... నేను డిస్ట్రిబ్యూటర్ గా చాలా సినిమాల ద్వారా డబ్బులు పోగొట్టుకున్నాను. మరి ముఖ్యంగా ఒక సంవత్సరం రెండు సినిమాల ద్వారా ఏకంగా 25 కోట్లు నష్టపోయాను అని చెప్పుకొచ్చాడు.

అసలు విషయం లోకి వెళితే ... తాజా ఇంటర్వ్యూలో భాగంగా దిల్ రాజు మాట్లాడుతూ ... 2017 వ సంవత్సరం నేను చాలా సినిమాలను నిర్మించాను. అలాగే కొన్ని సినిమాలను డిస్ట్రిబ్యూట్ కూడా చేశాను. ఇక 2017 వ సంవత్సరం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన అజ్ఞాతవాసి ,  మహేష్ బాబు హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో రూపొందిన స్పైడర్ మూవీ లను నేను డిస్ట్రిబ్యూట్ చేశాను. ఈ రెండు సినిమాలను భారీ ధరకు కొనుగోలు చేసి పెద్ద ఎత్తున విడుదల చేశాను. కానీ ఈ రెండు మూవీ లకు కూడా నెగటివ్ టాక్ రావడంతో ఆ సినిమాల ద్వారా దాదాపు నాకు 25 కోట్ల మేర నష్టం వచ్చింది.

ఇక ఆ సంవత్సరం నేను నిర్మించిన సినిమాలలో చాలా సినిమాలు అద్భుతమైన విజయాలను అందుకున్నాయి. వాటి ద్వారా నాకు పెద్ద మొత్తంలో లాభాలు వచ్చాయి. అలా నేను 2017 వ సంవత్సరం నిర్మించిన సినిమాల ద్వారా వచ్చిన లాభాలతో ,  ఆ సంవత్సరం నేను డిస్ట్రిబ్యూషన్ చేసిన సినిమాల ద్వారా వచ్చిన నష్టాలను పుడ్చుకున్నాను అని దిల్ రాజు ఒక ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: