![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore//images/categories/movies.jpg)
గతవారం విడుదలైన ‘తండేల్’ కు టోటల్ పాజిటివ్ టాక్ వచ్చింది. కలక్షన్స్ విషయంలో రికార్డులు బద్దలు కొడుతుందో లేదో ఇప్పటికీ స్పష్టమైన క్లారిటీ లేకపోయినప్పటికీ చైతన్య కెరియర్ లో ఈ మూవీ ‘ది బెస్ట్’ అని అంటున్నారు. ఈమధ్య కాలంలో మంచి అంచనాలు ఉన్న మీడియం రేంజ్ సినిమాలను విడుదలకు ముందురోజు స్పెషల్ షోలు వేసి హడావిడి చేయడం ఒక సాంప్రదాయంగా మారింది.
ఇటువంటి వ్యూహాలు అనుసరించకుండా కేవలం ప్రేక్షకులు ఇచ్చే పాజిటివ్ టాక్ ను నమ్ముకుని డైరెక్ట్ గా 7వ తేదీ మార్నింగ్ షోతో విడుదల చేశారు. చైతన్యకు మాస్ ప్రేక్షకులలో మంచి ఇమేజ్ లేకపోవడంతో ఈ సినిమాకు ఓపెనింగ్ కలక్షన్స్ అంతంత మాత్రంగా వచ్చాయి. అయితే ఈ మూవీకి టోటల్ పాజిటివ్ టాక్ రావడంతో ఈవినింగ్ షో ల నుండి కలక్షన్స్ ఊపు అందుకుని ఈ వీకెండ్ వరకు ధియేటర్లలో సందడి కనిపించింది.
సంక్రాంతికి విడుదలైన ‘సంక్రాంతికి వస్తున్నాం’ హడావిడి పూర్తిగా తగ్గిపోవడంతో ఈ గ్యాప్ ను ‘తండేల్’ బాగా ఉపయోగించు కుంటోంది. ఈ సినిమాకు మరే సినిమా పోటీ లేకపోవడంతో ఈ మూవీకి అన్నివిధాల కలిసివచ్చిందని అంటున్నారు. ఈమధ్యకాలంలో అంచనాలు ఉన్న సినిమాలకు టిక్కెట్ల రేట్లు పెంచడం అర్థరాత్రి షోలు వేయడం ఒక ట్రెండ్ గా మారింది.
దీనికితోడు టాప్ హీరోలకు అభిమానులు ఎంతమంది ఉంటారో నెగిటివ్ ప్రచారం చేసేవారు కూడ అంతకంటే రెట్టింపు స్థాయిలో ఉంటారు. సంక్రాంతికి విడుదలైన ‘గేమ్ ఛేంజర్’ మూవీ ఘోరమైన ఫ్లాప్ గా మారడానికి ఆమూవీ అర్థరాత్రి షో నుండి జరిగిన నెగిటివ్ ప్రచారం ఆన్న అభిప్రాయం ఇండస్ట్రీ వర్గాలలో ఉంది. అటువంటి సమస్యలు ఏమి ‘తండేల్’ విషయంలో ఎదురవ్వలేదు. ఈ విషయంలో నిర్మాత అల్లు అరవింద్ వ్యూహాత్మకంగా అనుసరించిన ఎత్తుగడ కూడ ‘తండేల్’ కు అన్నివిధాల సహకరించింది అన్న కామెంట్స్ వస్తున్నాయి. ఏది ఎలా ఉన్నా చైతన్యకు తాను కోరుకున్న హిట్ వచ్చింది అనుకోవాలి..