టాలీవుడ్ ఇండస్ట్రీలో విశ్వక్ సేన్ హీరోగా కెరీర్ ను మొదలుపెట్టి దాదాపుగా 8 సంవత్సరాలు అయింది. వెళ్లిపోమాకే సినిమాతో విశ్వక్ సేన్ హీరోగా కెరీర్ ను మొదలుపెట్టగా ఆప్పటినుంచి ఇప్పటివరకు కెరీర్ పరంగా వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. విశ్వక్ సేన్ కెరీర్ లో చెప్పుకోదగ్గ హిట్లు ఉన్నాయి. మెకానిక్ రాకీ మినహా గతేడాది విశ్వక్ సేన్ నటించిన సినిమాలు సక్సెస్ సాధించాయి.
 
విశ్వక్ సేన్ రెమ్యునరేషన్ ఒకింత భారీ స్థాయిలోనే ఉంది. మెగా, నందమూరి సపోర్ట్ తో విశ్వక్ కు హిట్ దక్కుతుందా అనే చర్చ ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా జరుగుతోంది. మరోవైపు లైలా ఈవెంట్ లో పృథ్వీరాజ్ చేసిన కామెంట్లపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సినిమా ప్రారంభంలో 150 గొర్రెలు ఉండేవని సినిమా చివరికి 11 మిగిలాయి అంటూ వైసీపీపై పరోక్షంగా పృథ్వీ సెటైర్లు వేశారు.
 
ఈ తరహా కామెంట్ల వల్ల లైలా సినిమాపై నెగిటివ్ ప్రభావం పడే అవకాశాలు అయితే ఉన్నాయి. లైలా సినిమా ఈ నెల 14వ తేదీన విడుదల కానుంది. తండేల్ సినిమాకు హిట్ టాక్ వచ్చినా ఈరోజు నుంచి ఈ సినిమా జోరు తగ్గే అవకాశం ఉన్న నేపథ్యంలో విశ్వక్ సేన్ జాగ్రత్త వహించాల్సి ఉంది. విశ్వక్ సేన్ కెరీర్ పరంగా నెక్స్ట్ లెవెల్ లో ప్లాన్ చేసుకోవాల్సి ఉంది.
 
పాన్ ఇండియా ప్రాజెక్ట్ లలో విశ్వక్ సేన్ నటిస్తే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విశ్వక్ సేన్ క్రేజ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉందని చెప్పవచ్చు. లైలా మూవీ ఒకింత భారీ స్థాయిలోనే కలెక్షన్లను సాధించే ఛాన్స్ అయితే ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి. లైలా సినిమా టాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్లలో ఒకటిగా నిలుస్తుందేమో చూడాలి. హీరోలు లేడీ గెటప్స్ వేసిన మెజారిటీ సందర్భాల్లో షాకులు తగలగా రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: