![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore//images/categories/movies.jpg)
‘పుష్ప 2’ బ్లాక్ బష్టర్ హిట్ అయినందుకు తాను గర్విస్తున్నాను అంటూ బాలకృష్ణ కాంపౌండ్ మెగా కాంపౌండ్ అన్నవిషయాల పై విశ్వక్ సేన్ చేసిన కామెంట్స్ కు తన సంఘీభావం తెలియచేస్తూ కొన్ని ఆశక్తికర కామెంట్స్ చేశారు. మనుషులన్నాక వేరే వాళ్లపై అభిమానం ప్రేమ ఉంటాయని రామ్ చరణ్ కు సూర్య అంటే చాలా ఇష్టం అని అంతమాత్రాన చెర్రీ ఫంక్షన్ కు తాను అతిధిగా వెళ్లకూడదా అంటూ చిరంజీవి కామెంట్స్ చేశారు.
అంతేకాదు ఇండస్ట్రీలో హీరోలు గిరిగీసుకుని ఉన్న రోజులు గతంలో ఉన్నాయని కానీ అది షూటింగుల వరకు మాత్రమే అని అంటూ చెన్నైలో ఉన్న హనీ హౌస్ లో జరిగే పార్టీలకు తెలుగు తమిళ ఇండస్ట్రీ నటీనటులు వెళుతూ ఉంటారని అయితే ఆవిషయాలు చాలమందికి తెలియవు అంటూ అభిప్రాయ పడ్డారు. అంతేకాదు నాగార్జున వెంకటేశ్ బాలకృష్ణలతో తాను ఎంతో ఫ్రెండ్లీగా ఉంటానని నాగార్జున తాను తరచుగా కలుస్తుంటామని అంటూ ఇండస్ట్రీలో తామంతా ఒక్కటే అన్న సంకేతాలు ఇవ్వడానికి చిరంజీవి ప్రయత్నించారు.
అంతేకాదు విశ్వక్ సేన్ పై ఒక ముద్ర వేసి అతడి ఫంక్షన్లకు వెళ్లకూడదని అనుకోవడం మంచికాదు అంటూ అతడు ఇండస్ట్రీలో ఒకడు అన్నసందేశాన్ని అందించడానికే తాను వచ్చాను అంటూ చిరంజీవి ఆశక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒక హీరోకు ఒక నిర్మాత అడ్వాన్స్ ఇస్తున్నాడు అంటే ఆ అడ్వాన్స్ ఆనిర్మాతకు వేరే హీరో సినిమా వల్ల వచ్చింది అన్నవిషయం అందరు గుర్తుంచుకోవాలి అంటూ ఇండస్ట్రీలో వర్గాలు లేవు అంటూ మరొకసారి తన అభిప్రాయాన్ని తెలియచేశారు..