ప్రస్తుతం వరుస విజయాలతో ఫుల్ జోష్ లో దూసుకుపోతున్న టాలీవుడ్ హీరోలలో నాచురల్ స్టార్ నాని ఒకరు. ఈ మధ్య కాలంలో ఈయన నటించిన చాలా సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి. ఆఖరుగా నాని , వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో సరిపోదా శనివారం అనే సినిమాలో హీరో గా నటించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి సక్సెస్ ను అందుకుంది. ఇకపోతే ప్రస్తుతం నాని , శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వంలో ది పారడైజ్ అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు.

మూవీ షూటింగ్ కొన్ని రోజుల క్రితమే ప్రారంభం అయింది. ఇకపోతే గతంలో నాని , శ్రీకాంత్ ఓదెల కాంబోలో దసరా అనే సినిమా వచ్చి అద్భుతమైన విజయం సాధించి ఉండడంతో ప్రస్తుతం వీరి కాంబోలో పొందుతున్న ది పారడైజ్ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇకపోతే ఈ సినిమాకు అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ కి అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు అనే న్యూస్ ను విడుదల చేయడంతో ఈ సినిమాపై అంచనాలు ప్రేక్షకుల్లో మరింతగా పెరిగిపోయాయి.

ఇకపోతే తాజాగా ది పారడైజ్ మూవీ కి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... ప్రస్తుతం ది పారడైజ్ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన గ్లిమ్స్ వీడియోను రూపొందిస్తున్నట్లు , మరికొన్ని రోజుల్లోనే దానిని విడుదల చేయనున్నట్లు అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను మరో ఒకటి , రెండు రోజుల్లో విడుదల చేయనున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఇక ప్రస్తుతం అనిరుద్ ఈ సినిమా గ్లిమ్స్ వీడియోకు అద్భుతమైన సంగీతం అందిచే పనిలో ఫుల్ బిజీగా ఉన్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: