తెలుగు , తమిళ్ , హిందీ సినిమాల ద్వారా ఇండియా వ్యాప్తంగా గుర్తింపును సంపాదించుకున్న ముద్దుగుమ్మలలో పూజా హెగ్డే ఒకరు. ఈమె నాగ చైతన్య హీరోగా రూపొందిన ఒక లైలా కోసం అనే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ మంచి విజయం సాధించడం , ఇందులో పూజ హెగ్డే తన నటనతో , అందాలతో ప్రేక్షకులను కట్టిపడేయడంతో ఈ మూవీ ద్వారా ఈమెకు తెలుగు సినీ పరిశ్రమలో మంచి క్రేజ్ వచ్చింది. ఈ మూవీ తర్వాత ఈమెకు వరస పెట్టి టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు దక్కాయి.

అందులో భాగంగా ఈమె ఇప్పటికే టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఎంతో మంది స్టార్ హీరోల సరసన ఆడి పాడి అద్భుతమైన గుర్తింపును సంపాదించుకుంది. ఇకపోతే ఈ మధ్య కాలంలో మాత్రం ఈమెకు సరైన విజయాలు దక్కడం లేదు. దానితో ఈమెకు అవకాశాలు కూడా కాస్త తగ్గాయి. దానితో పోయిన సంవత్సరం ఈమె నటించడం ఒక్క సినిమా కూడా విడుదల కాలేదు. మళ్లీ ఈమెకు అవకాశాలు పెరిగాయి. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో అనేక సినిమాలు ఉన్నాయి. తాజాగా ఈమె నటించిన వేద అనే హిందీ సినిమా విడుదల అయింది. ఈ సినిమాకు కూడా నెగటివ్ టాక్ వచ్చింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ బ్యూటీ ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది.

అందులో భాగంగా ఈమె తనకు ఎలాంటి సినిమాలలో నటించాలని ఉంది అనే కోరికను చెప్పుకొచ్చింది. తాజాగా పూజా హెగ్డే మాట్లాడుతూ ... తనకు సూపర్ మాన్ తరహా సినిమాల్లో నటించడం ఇష్టం అని , అలాంటి కథతో ఎవరైనా తన దగ్గరకు వస్తే ఎగిరి గంతేసి మరి ఆ సినిమాను ఓకే చెప్తాను అని పూజా హెగ్డే చెప్పుకొచ్చింది. ఇకపోతే పూజ హెగ్డే నటించిన అనేక సినిమాలు ఈ సంవత్సరం విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. మరి ఆ సినిమాలతో ఈ బ్యూటీ ఎలాంటి విజయాలను అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: