హీరో మోహన్ బాబు  ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఊపు ఊపిన నటుడు.. ముందుగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరియర్ మొదలుపెట్టిన ఆయన విలన్ పాత్రల్లో కూడా అదరగొట్టేశారు. అలా మెల్లిమెల్లిగా హీరోగా  అరంగేట్రం చేసి డైలాగ్ కింగ్ గా మారారు.. అలా మంచు ఫ్యామిలీలో మోహన్ బాబు అంటే ఒక బ్రాండ్ అనే పరిస్థితికి చేరుకున్నారు.. అలాంటి మోహన్ బాబు ఒకానొక సమయంలో సినిమాల ప్లాప్ లతో చాలా ఇబ్బందులు పడ్డారట. కనీసం ఆయనకు ఎవరు కూడా ఆఫర్లు ఇవ్వకపోవడంతో చివరికి ఆస్తులు అన్ని కుదువబెట్టి తానే స్వయంగా నిర్మాతగా మారి సినిమాను తీసుకున్నారట..ఆ ఒక్క సినిమాతోనే మోహన్ బాబు లైఫ్ మారిందని, ఈ సినిమా తీయడానికి కారణం రజినీకాంత్ అని కూడా తెలుస్తోంది. ఆ వివరాలు ఏంటో చూద్దామా.. హీరో రజినీకాంత్ అప్పటికే పెద్ద సూపర్ స్టార్. మోహన్ బాబుకు మంచి స్నేహితుడు.. 

ఇద్దరు కలిసి చాలా సినిమాల్లో నటించారు. ఈ తరుణంలో మోహన్ బాబు చేసిన ప్రతి సినిమా ఫ్లాప్ అయ్యింది.. దీంతో ఆయనకు ఆఫర్లు రాకపోవడంతో రజినీకాంత్ పిలిచి నీ సినిమాలు నువ్వే తీసుకో అని సజెషన్ ఇచ్చారట. దీంతో మోహన్ బాబు  'నట్టమై' అనే నిర్మాతతో  మీట్ అయ్యారట.. ఆ సినిమాకు సంబంధించి రీమేక్ రైట్స్ అన్ని తీసుకున్నారట. ఈ చిత్రానికి  బి గోపాల్ దర్శకుడిగా చేయాలని చెప్పడంతో రీమేక్ సినిమాలో నేను చేయలేనని చెప్పారట. ఆ తర్వాత రవి రాజా పినిశెట్టి దగ్గరికి వెళ్లి సినిమా గురించి చెప్పగా ఆయన ఒప్పుకొని డైరెక్షన్ చేశారు. తెలుగులో పెదరాయుడు పేరుతో ఈ సినిమా వచ్చింది. ఈ సినిమా నిర్మించడం కోసం మోహన్ బాబు తనకు ఉన్న ఆస్తులన్నీ కుదువపెట్టాడు.

ఇందులో రజనీకాంత్ మోహన్ బాబు తండ్రి పాత్రలో నటించారు. కానీ ఒక్క రూపాయి రెమ్యూనరేషన్ తీసుకోలేదు.. ఆ సినిమా చకచకా షూటింగ్ జరుపుకొని  థియేటర్లలోకి వచ్చింది. మొదటి రోజే సినిమా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకొని వందలాది రోజులు  హౌస్ ఫుల్ బోర్డులే కనిపించాయి. సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ కావడంతో రజనీకాంత్   చాలా సంతోషపడ్డారు.. నా మాట నమ్మి సినిమా తీశావు, అద్భుతమైన హిట్ వచ్చిందని మోహన్ బాబు  దగ్గరికి వెళ్లి కాళ్లు పట్టుకొని కృతజ్ఞతలు చెప్పారట.. ఈ సినిమా అప్పట్లోనే 12 కోట్ల రూపాయలు వసూలు చేసి రికార్డు క్రియేట్ చేసింది. అప్పటివరకు చిరంజీవి ఘరానా మొగుడు పేరుతో ఉన్నటువంటి 10 కోట్ల రికార్డును ఈ చిత్రం చెరిపేసిందని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: