మన హిందూ సాంప్రదాయాన్ని చాలావరకు సినిమా ఇండస్ట్రీలో ఉండే వారే రూపుమాపుతున్నారని చెప్పవచ్చు.. ప్రేమ, పెళ్లిళ్ల పేరుతో అనేకమంది ఒకటవుతూ  పిల్లలు పుట్టిన తర్వాత విడాకుల పేరుతో చాలామంది విడిపోతున్నారు. ఒక్కొక్కరు ఒకటి నుంచి మూడు వరకు పెళ్లిళ్లు చేసుకుంటూ హిందూ వివాహ బంధాన్ని ఇతర దేశాల సంస్కృతిలా మార్చేస్తున్నారు.. ఇక ఈ తంతు బాలీవుడ్ లో చాలా ఎక్కువ అయిపోయింది.. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్  మూడో పెళ్లి చేసుకోబోతున్నారని కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి.. ఇప్పటికి ఆరుపదుల వయస్సులో ఉన్న ఆయన  ఇలా మూడో పెళ్లి చేసుకోవడం  అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇంతకీ ఆయన చేసుకోబోయే అమ్మాయి ఎవరు.. వివరాలు ఏంటో చూద్దాం..

అమీర్ ఖాన్ అంటే కేవలం బాలీవుడ్ లోనే కాకుండా దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది.. ఇప్పటికే ఈయన సినీ ఇండస్ట్రీకి చేసిన సేవలకు పద్మభూషణ్, పద్మశ్రీ అవార్డులతో కేంద్ర సర్కార్ సత్కరించింది.. అయితే అమీర్ ఖాన్  1986లో రీనా దత్తానీ పెళ్లి చేసుకున్నారు.. వీరికి ఇద్దరు సంతానం కలిగారు. అలా 16 సంవత్సరాలు కలిసి కాపురం చేసిన తర్వాత వీరు విడాకులు తీసుకొని విడిపోయారు. ఆ తర్వాత తన వద్ద అసిస్టెంట్ గా పనిచేసిన కిరణ్ రావుతో ప్రేమలో పడి ఆమెను 2005లో పెళ్లి చేసుకున్నాడు.

వీరు ఒక బాబుకి జన్మనిచ్చిన తర్వాత ఏమైందో ఏమో ఇద్దరు విడాకులు తీసుకొని విడిపోయారు. ఇక అమీర్ ఖాన్ తాజాగా మూడో పెళ్లికి సిద్ధమయ్యారని తాను చేసుకోబోయే అమ్మాయి  సినీ ఇండస్ట్రీకి చెందినది కాదని తెలుస్తోంది. బెంగళూరుకు చెందిన  ఆ అమ్మాయి పేరు గౌరీ అని సమాచారం. ఇప్పటికే ఇరు కుటుంబాల మధ్య సంప్రదింపులు అయ్యాయని, అధికారికంగా ప్రకటించడమే లేటని తెలుస్తోంది.. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం అమీర్ ఖాన్ జీవిత పుస్తకంలో మరో కొత్త అధ్యాయం మొదలైనట్టే అంటున్నారు నెటిజెన్స్.

మరింత సమాచారం తెలుసుకోండి: