టాలీవుడ్, కోలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా మంచి పాపులారిటీ సంపాదించుకుంది హీరోయిన్ త్రిష. ఈమె వయసు 40 ఏళ్ల కూడా ఇంకా యంగ్ హీరోయిన్ గానే కనిపిస్తూ హీరోయిన్స్ కు దీటుగా తన అంద చందాలతో ఫ్యాన్స్ ని పెంచుకుంటూ ఉన్నది. సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా బడా హీరోలతో జతకడుతూ భారీగానే విజయాలను అందుకుంటోంది. అయితే ఈ మధ్యకాలంలో చాలా మంది అందంగా కనిపించడం కోసం సెలబ్రిటీలు సైతం సర్జరీలు చేయించుకుంటూ ఉన్నారు. సమంత, శృతిహాసన్, నయనతార తదితర హీరోయిన్స్ కూడా చేయించుకున్నారని వార్తలు వినిపించాయి.


అయితే తాజాగా కోలీవుడ్ లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం త్రిష కూడా ఒక సర్జరీకి సిద్ధమైనట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.. ముఖ్యంగా త్రిష తన లిప్స్ భాగానికి సర్జరీ చేయించుకోవడానికి సిద్ధమవుతున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. సోషల్ మీడియాలో త్రిష లిప్స్ కు సంబంధించి పలు రకాల ట్రోలింగ్స్ జరుగుతూ ఉండడంతో పాటుగా త్రిష పెదాల పైన కొంత మంది వల్గర్ గా కూడా కామెంట్స్ చేస్తూ ఉండడంతో ఇలాంటి నెగటివ్ ట్రోల్ ని భరించలేక త్రిష సర్జరీకి సిద్ధమైనట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.


ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ మొత్తానికి కోలీవుడ్లో ఈ విషయం వైరల్ గా మారుతున్నది.ఈ విషయం పైన అభిమానులు కూడా పెద్దగా రియాక్ట్ కాలేదు.. ఎవరి గ్రీన్ గా పేరు పొందిన త్రిష ఇలాంటి పనిచేస్తుందా అంటూ కొంతమంది నెటిజెన్స్ అయితే కామెంట్స్ చేస్తున్నారు.మొదటిసారి త్రిష ఇష్టం అనే చిత్రం ద్వారా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది ఆ తర్వాత ఎంతోమంది హీరోలతో కూడా నటించి బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకున్నది.. ఇటీవలే అజిత్ తో విడామమార్చి నటించిన సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా తెలుగులో అయితే పెద్దగా ఆకట్టుకోలేదనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: