టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ప్రతి సంవత్సరం ఎంతో మంది నటులు ఎంట్రీ ఇస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. వారిలో చాలా తక్కువ మంది మాత్రమే అద్భుతమైన గుర్తింపును సంపాదించుకుంటున్నారు. ఇకపోతే పైన ఫోటోలో ఓ బాబు ఉన్నాడు కదా ఆయన ఎవరో గుర్తుపట్టారా ..? ఆయన ఇప్పటికే చాలా సినిమాలలో హీరోగా నటించి మంచి విజయాలను అందుకొని నటుడిగా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు.

అలాగే ఇప్పటి వరకు ఆయన తాను నటించిన రెండు సినిమాలకు కూడా దర్శకత్వం వహించి దర్శకుడిగా కూడా తనకంటూ ఒక మంచి గుర్తింపు ఏర్పరుచుకున్నాడు. ఇప్పటికైనా ఆయన ఎవరో గుర్తుపట్టారా ..? పై ఫోటోలో ఉన్న బాబు మరెవరో కాదు ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన నటుడిగా కెరియర్ ను కొనసాగిస్తున్న వారిలో ఒకరు అయినటువంటి విశ్వక్ సేన్. ఈయన ఈ నగరానికి ఏమైంది సినిమాతో మంచి విజయాన్ని , మంచి గుర్తింపును దక్కించుకున్నాడు. ఇప్పటికే అనేక సినిమాలలో నటించి మంచి విజయాలను అందుకున్నాడు. ఇకపోతే ఈయన తాను హీరోగా నటించిన పలకనామా దాస్ , దాస్ కా దమ్కి అనే రెండు సినిమాలకు దర్శకత్వం వహించి దర్శకుడిగా కూడా మంచి గుర్తింపును దక్కించుకున్నాడు.

తాజాగా విశ్వక్ సేన్ "లైలా" అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ ని ఫిబ్రవరి 14 వ తేదీన విడుదల చేయనున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రచారాలను విశ్వక్ సేన్ పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నాడు. ఇకపోతే తాజాగా విశ్వక్ సేన్ హీరో గా రూపొందిన లైలా మూవీ పై తెలుగు ప్రేక్షకు ల్లో మంచి అంచనాలు నిలకొని ఉన్నాయి. మరి ఈ సినిమాతో ఈ నటుడు ఏ స్థాయి విజయాన్ని అందుకుంటాడో తెలియాలి అంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి:

Vs