దీంతో వైసిపి రెచ్చిపోయింది. హీరో విశ్వక్ నటించిన లైలా సినిమాను ఏపీలో బైకాట్ చేయాలంటూ సోషల్ మీడియాలో తెగ పోస్టులు పెడుతున్నారు. ఈ సినిమాను అడ్డుకుంటామని కూడా వార్నింగులు ఇస్తున్నారు వైసీపీ నేతలు. దీనంతటికీ కారణం టాలీవుడ్ కమెడియన్ పృథ్వీరాజ్. హీరో విశ్వక్ నటించిన లైలా సినిమా ఫ్రీ రిలీజ్.... ఈవెంట్ నిన్న జరిగింది. అయితే ఈ ఈవెంట్ లో టాలీవుడ్ కమెడియన్... పృధ్విరాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
సినిమా గురించి మాట్లాడాల్సింది పోయి వైసిపి పార్టీ గెలిచిన సీట్ల గురించి మాట్లాడారు. వైసీపీ పార్టీకి 11 సీట్లు వచ్చాయని యద్దేవా చేసే ప్రయత్నంలో భాగంగా... పృధ్విరాజ్ ప్రసంగం నడిచింది. ఈ సినిమా పేరు రిలీజ్ ఈవెంట్ సందర్భంగా పృథ్వీరాజ్ మాట్లాడుతూ... మేకల సత్యం అనే పాత్ర షూట్ జరిగేటప్పుడు ఒక సంఘటన చెప్పుకొచ్చారు. ఆ సమయంలో 150 మేకలు ఉన్నాయని పృథ్వి రాజు వివరించారు.
చివరికి ఎన్ని ఉన్నాయని లెక్కిస్తే సరిగ్గా 11 ఉన్నాయని... వైసీపీ సీతను గుర్తు చేస్తూ పృధ్విరాజ్ సెటైర్లు పేల్చారు. దీంతో ఇక్కడే వైసిపి పార్టీ నేతలకు మండింది. సినిమా గురించి మాట్లాడకుండా... వైసిపి పార్టీకి వచ్చిన 11 సీట్ల గురించి పృధ్విరాజ్ మాట్లాడడానికి సోషల్ మీడియాలో ఫైర్ అవుతున్నారు. వెంటనే లైలా సినిమాను బైకాట్ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. దీంతో బై కాట్ లైలా మూవీ అనే హ్యాస్టాగ్ కూడా ట్రెండ్ అవుతుంది.