పుష్ప-2 విడుదలై క్రియేట్ చేసిన సంచలనాలు అన్నీ ఇన్నీ కావు.ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎన్నో రికార్డులు కొల్లగొట్టింది. అయితే అలాంటి సినిమా విడుదలకు ముందు విడుదలయ్యాక ఎన్నో కాంట్రవర్సీలలో ఇరుక్కున్న సంగతి మనకు తెలిసిందే. ముఖ్యంగా అల్లు మెగా ఫ్యాన్స్ మధ్య వైరం పుట్టించడంతోపాటు అల్లు మెగా కుటుంబాల మధ్య కూడా గొడవలు ఉన్నాయని వార్తలు వినిపించాయి. అయితే అల్లు అర్జున్ జైలుకు వెళ్లిన సమయంలో చిరంజీవి నాగబాబు వెళ్లారు.అలాగే బెయిల్ మీద తిరిగి ఇంటికి వచ్చాక అల్లు అర్జున్ స్వయంగా వెళ్లి నాగబాబు చిరంజీవిలను కలిశారు.ఇదంతా పక్కన పెడితే మరోసారి అల్లు మెగా ఫ్యామిలీ గురించి ఒక వార్త వైరల్ అవుతుంది. అయితే తాజాగా మెగాస్టార్ చిరంజీవి విశ్వక్ సేన్ నటించిన లైలా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా వచ్చి సందడి చేసిన సంగతి మనకు తెలిసిందే. ఇక ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లో చిరంజీవి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. అలాగే ఆ కాంపౌండ్ ఈ కాంపౌండ్ ఆ కుటుంబం ఈ కుటుంబం అని ఏమీ ఉండదు.

అసలు ఇండస్ట్రీ అంతా ఒక్కటే.కాంపౌండ్ అని ఏమీ లేదు అని అన్నారు.అలాగే మేము ఏ హీరో సినిమా హిట్ అయినా కూడా ఎంజాయ్ చేస్తాం. అందరు హీరోలను ఎంకరేజ్ చేస్తాం. ఉదాహరణకు ఏవి లో పవన్ కళ్యాణ్ కనిపిస్తే చాలు అందరూ ఒకటే అరుపులు గోలలు ఈలలు వేస్తారు. ఇక ఆ అరుపులన్నీ చూసి నేను చాలా గర్వపడతాను సంతోషిస్తాను. అలాగే రీసెంట్గా పుష్ప-2 విడుదలై అతిపెద్ద హిట్ అయింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయినందుకు నేను ఎంతగానో గర్వపడుతున్నాను. మా ఫ్యామిలీలో కూడా ఎంతోమంది హీరోలు ఉన్నారు. కానీ కేవలం మా హీరోలు మాత్రమే ఎదగాలని అనుకోము.అందరి హీరోలను ఆదరిస్తాము. ఇండస్ట్రీలో ఏ హీరో సినిమా అయినా హిట్ అయితే ఆ ఇండస్ట్రీలో ఉన్న హీరోలు అందరూ మన ఇండస్ట్రీ గురించి గొప్పగా చెప్పుకుంటూ సంతోషపడాలి. కొన్ని సినిమాలు ఆడుతాయి కొన్ని సినిమాలు ఆడవు.

అలా అని ఎక్కువ తక్కువ చేసి చూడకూడదు అంటూ చిరంజీవి మాట్లాడారు. అయితే చాలా రోజుల నుండి పుష్ప-2 గురించి చిరంజీవి స్పందించడం లేదు మాట్లాడం లేదు అని ఎంతోమంది మాట్లాడుకుంటున్న వేళ పుష్ప-2 హిట్ అయినందుకు నేను గర్వపడుతున్నాను అని ప్రీ రిలీజ్ ఈవెంట్లో అందరి ముందే చిరంజీవి చెప్పడంతో అందరి నోళ్ళు మూతపడ్డాయి. అంతేకాదు పుష్ప-2 హిట్ అయినందుకు చిరంజీవి ఫీల్ అయిపోతున్నాడు జీర్ణించుకోలేకపోతున్నాడు అని కూడా వార్తలు వినిపించాయి.కానీ ఈ వార్తలన్నీ రూమర్లే అని, ఈ రూమర్లు క్రియేట్ చేసి ఎవరో రాక్షసానందం పొందడానికి తప్ప వారి ఫ్యామిలీల మధ్య ఏమి లేదని మరొకసారి చిరంజీవి మాటలతో అర్థమైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: