నాగచైతన్య హీరోగా చందూ మొండే్టి డైరెక్షన్ లో తెరకెక్కిన తండేల్ సినిమా విడుదలైన రెండో రోజే పైరసీ బారిన పడింది. తండేల్ మూవీ పైరసీ వెర్షన్ అందుబాటులోకి రావడంతో ఆ ప్రభావం థియేట్రికల్ కలెక్షన్లపై పడుతోంది. తండేల్ మూవీ నిర్మాత బన్నీవాస్ సినిమా పైరసీ బారిన పడటం గురించి సంచలన వ్యాఖ్యలు చేయగా ఆ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
 
పెద్ద సినిమాలు పైరసీ విడుదలైన తర్వాత చూద్దామని చాలామంది వెయిట్ చేస్తున్నట్టు ఉన్నారని బన్నీవాస్ అన్నారు. అలాంటి వాళ్లు ఒకే ఒక విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని ఆయన చెప్పుకొచ్చారు. గీతా గోవిందంమూవీ రిలీజ్ సమయంలో కేసులు ఏ విధంగా బుక్ అయ్యాయో చాలామంది అనుభవం ఉందని ఆయన కామెంట్లు చేశారు. డౌన్ లోడ్ చేసుకున్న వాళ్లపై కూడా కేసులు ఉన్నాయని బన్నీవాస్ తెలిపారు.
 
జైలు నుంచి కొంతమంది ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. జైలు నుంచి ఇప్పుడిప్పుడే కొంతమంది బయటికొస్తున్నారని బన్నీవాస్ చెప్పుకొచ్చారు. గీతా ఆర్ట్స్ సినిమాలను పైరసీ చేసిన వాళ్లను పైరసీ ప్రింట్ ను డౌన్ లోడ్ చేసిన వాళ్లను పైరసీ ప్రింట్ డౌన్ లోడ్ చేసిన వాళ్లను సులువుగా వదిలిపెట్టం అని బన్నీవాస్ కామెంట్లు చేశారు.
 
తండేల్ సినిమా ఫస్ట్ వీకెండ్ కలెక్షన్లు ఒకింత భారీ స్థాయిలోనే ఉన్నాయి. తండేల్ సినిమా టాలీవుడ్ రేంజ్ ను పెంచిన సినిమాలలో ఒకటిగా నిలిచింది. తండేల్ మూవీ కథ, కథనం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. నాగచైతన్యకు తండేల్ సినిమా సక్సెస్ తో ఉపశమనం దక్కిందని చెప్పవచ్చు. తండేల్ మూవీ ఫుల్ రన్ లో 100 కోట్ల రూపాయల మార్క్ ను అందుకుంటుందో లేదో చూడాలి. తండేల్ సినిమాకు టైటిల్ కూడా ప్లస్ అయిందని చెప్పవచ్చు. తండేల్ అంటే గుజరాతీ భాషలో నాయకుడు అనే అర్థం వస్తుంది.






మరింత సమాచారం తెలుసుకోండి: