సినిమా ఇండస్ట్రీ లో హీరోయిన్లకు కెరియర్ ఎక్కువ కాలం ఉండదు అని అభిప్రాయాలను చాలా మంది వ్యక్తం చేస్తూ ఉంటారు. అందుకు తగినట్టు గానే చాలా మంది హీరోయిన్ల విషయంలో కెరియర్ ప్రారంభం అయిన కొద్ది రోజులకే వారికి అవకాశాలు తగ్గడం జరుగుతూ ఉంటుంది. కానీ కొంత మంది మాత్రమే ఏకంగా స్టార్ హీరోల స్థాయిలో కెరియర్ను ముందుకు సాగిస్తూ ఉంటారు. అలాంటి వారిలో త్రిష , నయనతార ముందు వరసలో ఉన్నారు. వీరిద్దరు కూడా తమిళ సినిమాల ద్వారా కెరియర్ను మొదలు పెట్టి కోలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ స్థాయికి చేరుకున్న తర్వాత తెలుగు సినిమాల్లో నటించడం మొదలు పెట్టారు.

ఇక విరు టాలీవుడ్ ఇండస్ట్రీ లో కూడా స్టార్ హీరోయిన్ స్థాయికి చేరుకొని ఎంతో కాలం పాటు ఓ వైపు తమిళ్ , మరో వైపు తెలుగు సినిమాల్లో నటిస్తూ కెరియర్ ను బిజీగా కొనసాగించారు. కానీ ఈ మధ్య కాలంలో మాత్రం ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు తెలుగులో అడపా దడప  సినిమాలు చేస్తున్న ఎక్కువ శాతం మాత్రం తమిళ సినిమాల్లో నటించడానికి ఆసక్తిని చూపిస్తూ వస్తున్నారు. ఇకపోతే తమిళ సినిమా పరిశ్రమలో వీరిద్దరికి అద్భుతమైన గుర్తింపు ఉంది. వీరిద్దరూ ఇప్పటికే 40 సంవత్సరాల వయసు లోకి అడుగు పెట్టిన కూడా కుర్ర హీరోలతో స్టార్ హీరోలతో నటిస్తూ అద్భుతమైన జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తున్నారు.

ఇక వీరిద్దరికీ తమిళ ఇండస్ట్రీ లో మరే హీరోయిన్ కి రానంత రెమ్యూనరేషన్ కూడా అందుతున్నట్లు తెలుస్తోంది. అలా కోలీవుడ్ ఇండస్ట్రీ లో త్రిష , నయనతార అద్భుతమైన స్థాయిలో ఇప్పటికీ కూడా కెరియర్ ను ముందుకు సాగిస్తూ కుర్ర హీరోయిన్లకు మించిన స్థాయిలో అవకాశాలను దక్కించుకుంటూ కెరియర్ను ముందుకు సాగిస్తున్నారు. ఇకపోతే ప్రస్తుతం త్రిష , నయనతార చేతిలో అనేక క్రేజీ సినిమాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: