![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_latestnews/heroined1aa6177-1df7-4023-815b-17d54a93df47-415x250.jpg)
ఇక మృణాల్ సినీ జీవితాన్ని ముందుగా మొదలుపెట్టింది మరాఠి సినిమాల్లో ఆ తర్వాత బాలీవుడ్ కి వెళ్ళింది .. అక్కడ పలు హిందీ సినిమాలు చేసింది కానీ తన శ్రమకు తగ్గ ఫలితం మాత్రం బాలీవుడ్లో అందుకోలేకపోయింది .. ఇక అదే క్రమంలో తెలుగులో సీతారామం అనే సినిమాతో అడుగుపెట్టింది .. ఇక మొదటి సినిమాతోనే మంచి హిట్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత బిజీ హీరోయిన్గా అవుతుందని అంత అనుకున్నారు .. కానీ మృణాల్ మాత్రం సినిమాలను తగ్గించుకుంది. ఇక సీతారామంలో దుల్కర్ సల్మాన్ కు జంటగా సీత పాత్రలో నటించిన మృణాల్ ఒక్క సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను ఎంతగానో కట్టిబడేసింది .. అలాగే తన నటనతో అందరినీ మెప్పించి వావ్ అనిపించింది .. ఇక తర్వాత తెలుగులో ఈమెకు వరుసగా సినిమా అవకాశాలు వచ్చాయి ..
అలాగే కోలీవుడ్ లో కూడా మురగదాస్ - శివ కార్తీకేయన్ సినిమాలో కూడా ఈమెకు హీరోయిన్గా అవకాశం వచ్చింది .. కానీ రీజన్ ఏమిటో తెలియదు కానీ ఈ సినిమాను కూడా వదిలేసింది .. కోలీవుడ్ ఛాన్స్ వదిలేసుకున్న సమయంలో విజయ్ దేవరకొండకు జంటగా ఫ్యామిలీ స్టార్ సినిమాలో నటించే అవకాశం వచ్చింది .. ఇక గతి ఏడాది ఈ మూవీ భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి డిజాస్టర్ గా మిగిలింది .. ఆ సినిమా దగ్గరనుంచి ఇప్పటివరకు మృణాల్ కు మరో అవకాశం రాలేదు .. అలాగే గ్లామర్ విషయంలో కూడా ఎలాంటి కండిషన్స్ పెట్టకపోయినా ఈమెకి సినిమా అవకాశాలు రావట్లేదు అనేది మాత్రం వాస్తవం .. తనకు సినిమా అవకాశాలు రాకపోవటంతో ఇండస్ట్రీకి దూరం అవ్వాలనే ఆలోచనలో ఉందని ఒకవైపు వార్తలు వస్తున్నాయి .. ఇక సినిమాలకు కాస్త గ్యాప్ తీసుకుని మంచి కథతో మళ్ళీ రీఎంట్రీ ఇవ్వాలని మృణాల్ భావిస్తున్నట్టు ఆమె సన్నిహిత వర్గాల నుంచి అందుతున్న టాక్ .. అయితే ఏదేమైనా కూడా ఈ విషయంపై మృణాల్ ఠాకూర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంది అనేది ఆమెకే తెలియాలి.