![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_latestnews/heroes821df128-1f59-4223-8a5a-f79745e9a492-415x250.jpg)
అయితే ఇవన్నీ ముందు అనుకునే మాటలే ఆ టైం వచ్చేసరికి ఎన్నో లెక్కలు మారిపోతాయి .. మరికొన్ని సినిమాలు ఆ తేదీలకు వస్తాయి .. ప్రతి సంవత్సరం జరిగే తంతే ఇది అయితే చిరు - రావిపూడి సినిమాపై మాత్రం కాస్త నమ్మకంగా ఉన్నారు ప్రేక్షకులు. ఇక సంక్రాంతి వార్‌లో అనిల్ కి మంచి ట్రాక్ రికార్డు ఉంది .. ప్రధానంగా ఈ ఏడాది సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ అందుకున్నాడు .. ఇక దీంతో ఈ దర్శకుడికి సంక్రాంతి సీజన్ పెద్ద సెంటిమెంట్ గా మారిపోయింది .
ఇక చిరంజీవికి కూడా సంక్రాంతికి వచ్చి చాలా సంవత్సరాలు అవుతుంది .. ఇప్పటికే ఈ ఏడాది జస్ట్ లో మిస్సయింది .. వచ్చే సంవత్సరాన్ని వదులుకునే పరిస్థితుల్లో మెగాస్టార్ లేరు. ఇక్కడ ఎటోచ్చినా ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమాపై మాత్రం గట్టిగా డౌట్స్ వస్తున్నాయి .. ఎన్టీఆర్ కైనా ప్రశాంత్ కైనా యాడాది టైమ్ సరిపోదు వాళ్ళకి ఇంకా ఎక్కువ సమయం కావాలి అదే రావిపూడి కైతే కేవలం ఐదు నెలలు టైం ఉంటే సినిమాను కంప్లీట్ చేస్తాడు. ఇక మరి ఈ వచ్చే సంక్రాంతికి చిరు వర్సెస్ ఎన్టీఆర్ గా ఉంటుందా .. లేక ఎన్టీఆర్ సినిమా మధ్యలోనే డుమ్మా కొడుతుందా అనేది చూడాలి.