![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_latestnews/keerhi-suresh-marrige-photos-viral2c297e65-4711-43a6-8365-5239b50fbd0d-415x250.jpg)
ఇక వివాహం తర్వాత కీర్తి సురేష్ నటించిన బేబీ జాన్ అనే సినిమా విడుదలవ్వగా సక్సెస్ కాలేకపోయింది. దీంతో ప్రస్తుతం తన భర్తతో కలిసి హనీమూన్ వెకేషన్స్ తో ఎంజాయ్ చేస్తుంది. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కూడా తన ఫోటోలను పంచుకుంటూ ఉంటుంది కీర్తి సురేష్. తాజాగా కీర్తి సురేష్ తన ఇంస్టాగ్రామ్ లో కొన్ని ఫోటోలను పంచుకుంది. అందులో తాను పెళ్లి కూతురుగా అయినటువంటి కొన్ని ఫోటోలను షేర్ చేయడమే కాకుండా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఈ ఫోటోలకు జోడించడం జరిగింది.
అలాగే ఈ ఫోటోలకు క్యాప్షన్ ఇలా రాసుకోస్తూ "తాను అలంకరించిన కవిత" అంటూ రాసుకుంది.. సోషల్ మీడియాలో ఈ ఫోటోలు వైరల్ కావడంతో వాటి ని చూసిన సైతం ఆకాశంలో చందమామలా ఉన్న కీర్తి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. పలువురు సెలబ్రిటీలు కూడా ఈ ఫోటోలను లైక్ చేస్తూ వైరల్ గా చేస్తూ ఉన్నారు. మొత్తానికి ఎట్టకేలకు తన పెళ్లి ఫోటోలను సైతం కీర్తి సురేష్ షేర్ చేసింది. ప్రస్తుతం పలు రకాల లేడి ఒరేంటెడ్ చిత్రాలలో నటిస్తూనే బాలీవుడ్ లో కూడా పలు చిత్రాలను నటించడానికి ప్లాన్ చేస్తోంది కీర్తి సురేష్. మరి వివాహం అనంతరం సినిమాలతో మంచి విజయాలను అందుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.