![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_latestnews/nagarjuna-62eac101-e93b-475d-98a0-1c3c7226838c-415x250.jpg)
నాగ చైతన్య - సాయి పల్లవిల కాంబోలో రీసెంట్గా తెరకెక్కిన మూవీనే ఈ "తండేల్". ఈ సినిమా కోసం బాగా కష్టపడ్డాడు నాగచైతన్య . సాయి పల్లవి కూడా బాగా నటించి మెప్పించింది . ఈ సినిమా రీసెంట్గా సూపర్ డూపర్ హిట్ అందుకుంది. అయితే నాగచైతన్య పెళ్లి తర్వాత రిలీజ్ అయిన ఫస్ట్ సినిమా ఇదే కావడం గమనార్హం. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో క్రెడిట్ మొత్తం శోభిత ధూళిపాళ్ల ఖాతాలో పడిపోయింది. శోభిత ధూళిపాళ్ల లక్ కారణంగానే నాగచైతన్యకు ఇంత పెద్ద హిట్ పడింది అని కెరియర్ లో ఇప్పటివరకు ఇలాంటి ఒక హిట్ అందుకోనే అందుకోలేదు అని జనాలు మాట్లాడుకుంటున్నారు .
అంతేకాదు నాగచైతన్య లైఫ్ లో జరిగినట్టే గతంలో అక్కినేని నాగార్జున లైఫ్ లో జరిగింది అని మాట్లాడుకుంటున్నారు. నాగార్జున కూడా అమల తన లైఫ్ లోకి వచ్చాక బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకొని స్టార్ హీరోగా మారిపోయాడు అని.. ఇప్పుడు అదే విధంగా అక్కినేని నాగచైతన్య తను రెండో భార్య లైఫ్ లోకి రాగానే సూపర్ డూపర్ హిట్స్ తో ముందుకు వెళ్ళిపోతున్నాడు అని జనాలు మాట్లాడుకుంటున్నారు. సోషల్ మీడియాలో ప్రెసెంట్ ఈ న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. మొత్తానికి నాగ చైతన్య - సాయిపల్లవిల కష్టాని శోభిత ఖాతాలో వేసేసిన్నట్లు అయ్యింది..!