![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_latestnews/rajamouli51b154dc-220c-4a22-a720-100576235404-415x250.jpg)
బాహుబలి సినిమాలతో సౌత్ సినిమాలకు నార్త్ మార్కెట్లో భారీ గేట్లు ఓపెన్ చేసి పెట్టారు .. ఒక విధంగా తెలుగు సినిమాలను చూసి నార్త్ వారు ఆలర్ట్ అయ్యే స్టిచ్యువేషన్ క్రియేట్ అయింది .. మనం కూడా రాజమౌళి లాగా ముందుకు వెళ్దామని.. ప్రశాంత్ నీల్ , అట్లీ లాంటి దర్శకులు కూడా అంతే డేర్ గా ఒక అడుగు ముందుకు వేశారు. ఇక త్రిబుల్ ఆర్ తో ఏకంగా ఇంటర్నేషనల్ వేదిక మీద తెలుగు సినిమాకు గౌరవం తీసుకువచ్చారు రాజమౌళి. ఇక అప్పటి నుంచి ఈయనతో కలిసి సినిమాలు చేయడానికి ఎంతో మంది ఇంటర్నేషనల్ సెలబ్రిటీస్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు .. ఇక వారందరితో కలిసి నడవాలనే కోరిక రాజమౌళిలో మాత్రం ఉండదా ఏంటి ? అందుకే మహేష్ సినిమాతో రీజినల్ హీరోల కాంబోకి పులిస్టాప్ పెడతారనే మాట గట్టిగా వినిపిస్తుంది.
మహేష్ తో చేసే సినిమా కోసం ఇప్పటికే ఓ ఓటీటీ సంస్థతో భారీ డీల్ కుదుర్చుకున్నారట రాజమౌళి .. అందుకే సినిమా ప్రోగ్రెస్ కి సంబంధించి చిన్న పిక్‌ను కూడా లీక్ చేయడం లేదట .. దాదాపు 72 దేశాల్లో ఈ సినిమాను రిలీజ్ చేయడానికి రెడీ అవుతుంది ఆ ఓటీటీ సంస్థ. అంత పెద్ద రిలీజ్ చూశాక అప్లాజ్ అందుకున్నాక రాజమౌళి ఇక రీజినల్ హీరోలతో సినిమాలు చేస్తారని ఆశలు వదులుకుంటున్నారు సినీ క్రిటిక్స్ .. ఇక మహేష్ సినిమా తర్వాత రాజమౌళి చుపు మొత్తం హాలీవుడ్ పైనే ఉంటుంది అన్నది జోరుగా సాగుతున్న ప్రచారం .